Ram Charan : రామ్ చరణ్ తన బాడీగార్డ్‌కు రోజుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన మోస్ట్ అవేటెడ్ ప్యాన్-ఇండియా చిత్రం ‘పెద్ది‘ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఇటీవల ముంబైలో అత్యంత వైభవంగా జరిగింది. అయితే ఈ ఈవెంట్లో సినిమా హడావుడితో పాటు రామ్ చరణ్ పక్కన ‘షాడో’లా నిలిచిన ఒక ప్రత్యేక వ్యక్తి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆయన మరెవరో కాదు అంతర్జాతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ కెవిన్ కుంటా చరణ్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టినప్పటి నుండి ఈవెంట్ ముగిసే వరకు కెవిన్ ప్రత్యేక బాడీగార్డ్‌గా వ్యవహరించారు.
సెలబ్రిటీల పక్కన బాడీగార్డ్స్ ఉండటం సహజమే కానీ కెవిన్ కుంటా కేవలం ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్ మాత్రమే కాదు ఆఫ్రికా ఖండంలోని గాంబియా దేశానికి చెందిన కెవిన్ ప్రస్తుతం ఇటలీలో నివసిస్తున్నారు. ఇటలీలో ప్రొఫెషనల్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌గా కెవిన్ ఎన్నో రికార్డులు సృష్టించారు. అంతేకాకుండా ఇటలీ మిడిల్ వెయిట్ ఛాంపియన్‌గా కూడా నిలిచారు. కెవిన్ కుంటా సిక్స్‌ప్యాక్ బాడీ, ఎత్తైన కటౌట్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్ పక్కన ఇతను నడుచుకుంటూ వస్తుంటే ఏదో హాలీవుడ్ యాక్షన్ సినిమా సెట్లోని దృశ్యంలా ఉందంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. గ్లోబల్ స్టార్ భద్రత కోసం ఈ అంతర్జాతీయ ఫైటర్‌ను రంగంలోకి దించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా కెవిన్ కుంటాకు రామ్ చరణ్ ఇస్తున్న రెమ్యునరేషన్ గురించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఇంటర్నేషనల్ ఫైటర్‌కు కేవలం రోజుకు ఏకంగా రూ. 2 లక్షల వరకు చరణ్ చెల్లిస్తున్నట్లు నెటిజన్లు, సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఈ లెక్కన చూస్తే దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న బాడీగార్డుల జాబితాలో ఇతను కూడా చేరిపోయాడని చెప్పాలి.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
తాజావార్తలు
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
-
Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి ‘రామోజీ గ్రూప్’.. ‘తెల్ల కాగితం’తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!