NTV Telugu Site icon

Ram Charan: క్రికెట్ లోకి అడుగుపెట్టిన గేమ్ ఛేంజర్… ఏకంగా టీమ్ కొనేసాడు

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. 2024 సెప్టెంబర్ రిలీజ్ ని టార్గెట్ చేస్తూ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ కంప్లీట్ అవ్వగానే చరణ్, బుచ్చిబాబుతో RC16 రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నాడు. బుచ్చిబాబు రామ్ చరణ్ ఫ్రీ అవ్వగానే ఆర్సీ 16 షూటింగ్ ని స్టార్ట్ చేసేలా ప్రీప్రొడక్షన్ వర్క్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రెహ్మాన్ మ్యూజిక్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే బజ్ క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాలు తప్ప చరణ్ లైనప్ లో ఉన్న ఇతర సినిమాల వివరాలు ఇంకా బయటకి రాలేదు. సుకుమార్, ప్రశాంత్ నీల్, లోకి… ఇలా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి కానీ ఏదీ అఫీషియల్ గా అనౌన్స్ అవ్వలేదు.

చరణ్ సినిమాల విషయం కాసేపు పక్కన పెడితే… చరణ్ స్పోర్ట్స్ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ తో పాటు చరణ్ కూడా ఒక క్రికెట్ టీమ్ కి ఓనర్ అయ్యాడు. ISPL-T10 (ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ – T10)లో హైదరాబాద్ క్రికెట్ జట్టుని చరణ్ కొన్నాడు. ఐపీఎల్ టీ20 అయితే ఐఎస్పీఎల్ 10 ఓవర్లు మాత్రమే ఉంటుంది. 2024 మార్చ్ 2 నుంచి మొదలవనున్న ఈ ప్రీమియర్ లో చరణ్ టీమ్ ఆడనుంది. స్టీట్ టు స్టేడియమ్ అనే స్లోగన్ తో ఈ ప్లేయర్స్ రిజిస్ట్రేషన్ ని ఓపెన్ చేసారు. మరి ఈ బిజినెస్ లో చరణ్ ఎంతవరకు సక్సస్ అవుతాడు అనేది చూడాలి.

 

Show comments