Ram Charan : ‘పెద్ది’ని చూసి రామ్ చరణ్ ఎమోషనల్… వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కళ్లలో కన్నీళ్లు! అవును, ఇటీవల థియేటర్లో తన సినిమా ‘పెద్ది’ చూస్తూ చరణ్ ఎంతో ఎమోషనల్ అయిపోయాడు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ సీన్‌ను చూసి ఆయన భావోద్వేగానికి గురయ్యారు. సినిమా వివాదం, భారీ కలెక్షన్స్ సాధిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఈ సినిమాను హైదరాబాద్‌లోని ప్రైవేట్ స్క్రీనింగ్‌లో చూశాడు. చెర్రీ పక్కనే కూర్చున్న దర్శకుడు బుచ్చిబాబు కూడా థియేటర్లో వీడియోలు తీస్తూ సినిమాకు ఆడియన్స్ ఇస్తున్న రియాక్షన్ ను చూసి ఎంజాయ్ చేశారు.
బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ సినిమా 1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగుతుంది. రామ్ చరణ్ ‘పెద్ది’ అనే గ్రామ యువకుడి పాత్రలో నటించాడు. జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా, ఎ.ఆర్. రహ్మాన్ సంగీతం అందించారు. సినిమా క్రికెట్, కుస్తీ వంటి స్పోర్ట్స్ ద్వారా గ్రామం గుర్తింపు కోసం పోరాడే యువకుడి కథ. ‘పెద్ది’ గ్రామం పేరు కూడా లేని, ప్రభుత్వ రికార్డుల్లో లేని ఒక చిన్న ఊరు. అక్కడి వాళ్లు ఉన్నా లేనట్టే. ఈ గ్రామానికి గుర్తింపు తేవాలని పెద్ది తన జీవితాన్నే పణంగా పెట్టి పోరాడతాడు. సినిమాలో స్పోర్ట్స్, యాక్షన్, ఎమోషన్, సామాజిక సందేశం అన్నీ బ్యాలెన్స్‌గా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ కన్నీళ్ళు పెట్టించేలా ఉంది. హీరో త్యాగం చూసి ప్రేక్షకులంతా ఎమోషనల్ అవుతున్నారు.
Also Read
- DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
- Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
ధియేటర్ లో #PEDDI సినిమా చూస్తూ ఎమోషనల్ అయిన @AlwaysRamCharan
సినిమా క్లెమాక్స్ కు చరణ్ కంట కన్నీరు.. #Ramcharan #Buchibabusana@PeddiMovieOffl @vriddhicinemas pic.twitter.com/rxiqb9bLar— SZN (@Suzenbabu) June 7, 2026
ఇంత హార్ట్ టచింగ్ క్లైమాక్స్ చూసి రామ్ చరణ్ కూడా ఎమోషన్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. థియేటర్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు అతని కళ్లలో నీళ్లు తిరగడం ఫ్యాన్స్‌ను మరింత ఎమోషనల్ చేస్తోంది. తాను పోషించిన పాత్ర ఎంత బలంగా ఉంటే ఒక స్టార్ నటుడు కూడా ఎమోషనల్ అయ్యాడంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక పెద్ది సినిమా విడుదలైన మొదటి నాలుగు రోజుల్లోనే 236 కోట్ల భారీ వసూళ్లు సాధించింది. రామ్ చరణ్ ఫిజికల్ ట్రాన్స్ఫార్మేషన్, ఎమోషనల్ సీన్స్‌లో అతని నటన కెరీర్ బెస్ట్ అంటున్నారు. చరణ్ భార్య ఉపాసన కూడా సినిమా చూసి ఎంతో ఎమోషనల్ అయ్యారట. చిరంజీవి ఈ సినిమాను గ్రాండ్ సక్సెస్ అని అభినందించిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్‌పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
DongaNaaKoduku : దొంగ నా కొడుకు సెప్టెంబర్ లో వస్తున్నాడు.. సెంటిమెంట్ కలిసొస్తుందా?
-
IND vs SL Test: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. రెండో టెస్టుకు స్టార్ ప్లేయర్ దూరం!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!