NTV Telugu Site icon

Ram Charan : ఇంద్రకీలాద్రిపై హద్దులు దాటిన మెగా అభిమానం… వీడియో వైరల్

Ram Charan

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్ తో దేశవ్యాప్తంగా చెర్రీకి అభిమానగణం ఏర్పడ్డారు. ఎక్కడికెళ్ళినా చెర్రీతో సెల్ఫీల కోసం జనాలు ఎగబడుతున్నారు. తాజాగా రామ్ చరణ్ విజయవాడ చేరుకోగా, అక్కడ ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటింది.

Read Also : Vijay Babu : ఆడిషన్ కు పిలిచి అత్యాచారం… పరారీలో నటుడు

చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న మెగా మల్టీస్టారర్ “ఆచార్య” మరో రెండ్రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో ‘ఆచార్య’ టీం అమ్మవారి ఆశీస్సుల కోసం విజయవాడ వెళ్లారు. హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ‘ఆచార్య’ డైరెక్టర్ కొరటాల, రామ్ చరణ్ కు ఎయిర్ పోర్ట్ వద్ద ఘన స్వాగతం పలికారు మెగా అభిమానులు. అనంతరం ఇంద్రకీలాద్రి పై దుర్గమ్మ ను దర్శించుకోవడానికి ‘ఆచార్య’ టీం వెళ్లారు. ఆలయం వరకూ బైకులపై ర్యాలీగా వెళ్లిన అభిమానులు, అక్కడి చేరుకోగానే హంగామా సృష్టించారు.  అయితే అక్కడ ఫ్యాన్స్ అభిమానం హద్దులు దాటింది. అభిమానుల వల్ల ఇంద్రకీలాద్రిపై అపచారం జరిగింది. చెర్రీని చూడడానికి భారీ సంఖ్యలో అభిమానులు ఆలయంలోకి దూసుకొచ్చారు. కానుకల హుండీపై నిలబడడమే కాకుండా జై చరణ్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, ఫోటోలు వీడియోలు తీశారు. పోలీసులు, దుర్గ గుడి అధికారుల సమన్వయం లోపం కారణంగా ఏర్పడిన ఈ గందరగోళం వల్ల ఆలయం లోపల రైలింగ్ రాడ్లు విరిగాయి. అంతేకాదు క్యూ లైన్లలో తొక్కిసలాట జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.