RRR విడుదలైనప్పటి నుండి ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రల గురించి చర్చలు జరుగుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మ్యాగ్నమ్ ఓపస్ లో రామ్, భీమ్ పాత్రలను, ఆయా పాత్రల హీరోయిజాన్ని సమానంగా చూపించినప్పటికీ, ఆ విషయంలో టాక్ మాత్రం విభిన్నంగా నడుస్తోంది. కొందరు ఎన్టీఆర్ కంటే చరణ్‌కు మంచి పాత్ర లభించిందని అంటే, మరికొందరేమో చరణ్‌ని డామినేట్ చేస్తూ సినిమా మొత్తాన్ని ఎన్టీఆర్ తన భుజాలపై వేసుకున్నాడని అంటున్నారు. ఏదేమైనా ఇద్దరు హీరోలు మాత్రం తమ తమ పాత్రలతో, వాటి స్క్రీన్ స్పేస్ తో సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు.
Read Also : RRR : రాజమౌళి యాక్షన్ సీక్రెట్ రివీల్… సీక్వెల్ పై కూడా క్లారిటీ
ముంబైలో గత రాత్రి పెన్ స్టూడియోస్ ఏర్పాటు చేసిన సక్సెస్ పార్టీకి ‘ఆర్ఆర్ఆర్’ బృందం హాజరయ్యారు. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ లో భాగంగా జరిగిన మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ సినిమాలో రామ్ చరణ్ అన్ని మార్కులు కొట్టేశాడు అంటూ ఎన్టీఆర్ పై చరణ్ డామినేషన్ అనే విషయాన్నీ ఎత్తబోయారు ఒక జర్నలిస్ట్. కానీ చరణ్ వెంటనే స్పందిస్తూ “అది నిజం కాదు. నేను దానిని అస్సలు నమ్మను. మేమిద్దరం చాలా బాగా చేశాము. తారక్ అద్భుతంగా నటించాడు. నా కెరీర్‌లో మరే ఇతర సినిమాలో పని చేయడాన్ని నేను ఇంతగా ఆస్వాదించలేదు. తారక్‌తో నా ప్రయాణం బాగా నచ్చింది. ఈ అవకాశం ఇచ్చినందుకు రాజమౌళి గారికి ధన్యవాదాలు’ అని చరణ్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది జరిగితే RRR సీక్వెల్‌లో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి పని చేయాలని కోరుకున్నారు.