Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన అభిరుచికి తగ్గట్టుగా హైదరాబాద్ శివార్లలో ఒక అద్భుతమైన ఫామ్‌హౌస్‌ను నిర్మించుకున్నారు. నగరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చేవెళ్ల – మోకిల పరిసర ప్రాంతాల్లోని తన 5 ఎకరాల సొంత స్థలంలో చరణ్ ఈ విలాసవంతమైన ఫామ్‌హౌస్‌ను నిర్మించినట్లు సమాచారం. ప్రకృతి ఒడిలో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్మితమైన ఈ లగ్జరీ హౌస్ పనులు దాదాపు పూర్తయ్యాయి. అతి త్వరలోనే రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడ ఘనంగా గృహప్రవేశం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ అద్భుతమైన ఫామ్‌హౌస్‌కు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్లు అమీర్ శర్మ, హమీదా శర్మ రూపకల్పన చేశారు. ఆధునిక హంగులతో పాటు ప్రకృతికి దగ్గరగా ఉండేలా, పచ్చదనం పరుచుకున్నట్లు ఉండే వినూత్నమైన ఆర్కిటెక్చర్‌తో దీనిని తీర్చిదిద్దారు. విలాసవంతమైన గదులు, స్విమ్మింగ్ పూల్, లాన్ మరియు ఇండోర్-అవుట్డోర్ అనుసంధానంతో ఈ ఫామ్‌హౌస్ ఒక ప్రైవేట్ రిసార్ట్‌ను తలపించేలా ఉంది. ఈ ఫామ్‌హౌస్ కేవలం వీకెండ్స్ గడపడానికే కాదు ప్రకృతి సేద్యం చేయడానికి కూడా చరణ్ ఉపయోగించబోతున్నారు. సినిమా షూటింగులతో నిరంతరం బిజీగా ఉండే రామ్ చరణ్ తన భార్య ఉపాసన, కుమార్తె క్లిన్ కారాతో కలిసి నేచర్ కి దగ్గరగా ఉండేందుకు ఈహౌస్ తీసుకున్నారు. ఈ 5 ఎకరాల స్థలంలో కొంత భాగాన్ని ఆర్గానిక్ వ్యవసాయానికి కేటాయించి, సొంతంగా కూరగాయలు, పండ్ల తోటలను పెంచాలని చరణ్ ప్లాన్ చేస్తున్నారు. చరణ్ కుటుంబ సభ్యులకు, అత్యంత సన్నిహితులకు మరియు ఇండస్ట్రీలోని క్లోజ్ ఫ్రెండ్స్‌కు మాత్రమే ఈ ఫామ్‌హౌస్ ఒక ప్రైవేట్ గెట్-అవేగా మారనుంది. ప్రస్తుతం చరణ్ నటిస్తున్న భారీ చిత్రాల షూటింగ్స్ పూర్తి కాగానే ఈ సరికొత్త విల్లాలో గృహప్రవేశ వేడుక జరగనుందని మెగా వర్గాల సమాచారం.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
తాజావార్తలు
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!