Site icon NTV Telugu

Buchibabu: హ్యాపీ బర్త్ డే బుచ్చి మావా బ్రో… #RC16తో పాన్ ఇండియా షేక్ అవ్వాలి

Buchi Babu

Buchi Babu

లెక్కల మాస్టర్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడిగా మంచి పేరు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఉప్పెన సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఒక రెగ్యులర్ లవ్ స్టొరీకి కొత్త బ్యాక్ డ్రాప్ యాడ్ చేసి, తెలుగు ఆడియన్స్ కలలో యాక్సెప్ట్ చేస్తారు అనుకోని ఒక విషయాన్ని చాలా కన్వీన్సింగ్ గా చెప్పాడు బుచ్చిబాబు. హీరో, హీరోయిన్ ని డెబ్యు మూవీ అయినా తన రైటింగ్ ని నమ్మి సినిమా చేసిన బుచ్చిబాబు, ఆశించిన రేంజ్ హిట్ కన్నా ఎక్కువ అందుకున్నాడు. ఈరోజు బుచ్చిబాబు పుట్టిన రోజు కావడంతో చరణ్, బుచ్చిబాబుకి బర్త్ డే విషెస్ తెలియజేసాడు. ఈ కాంబినేషన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నుంచి సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మొదటి సినిమాతోనే సుకుమార్ కి తగ్గ శిష్యుడు అనిపించుకున్న బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో మూవీ చెయ్యడానికి ఈగర్ గా వెయిట్ చేశాడు. ఇతర హీరోలు, ప్రొడ్యూసర్స్ బుచ్చిబాబుతో సినిమా చెయ్యడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించారు కానీ బుచ్చిబాబు మాత్రం ఎన్టీఆర్ తోనే సినిమా చేస్తాను అని దాదాపు రెండేళ్ల ఎదురు చూశాడు.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ఎన్టీఆర్ 30 సినిమా అనుకున్న టైంకి స్టార్ట్ అయ్యి ఉంటే, బుచ్చిబాబు-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఆన్ లో ఉండేది. ఎన్టీఆర్ 30 డిలే అవ్వడంతో బుచ్చిబాబు, ఎన్టీఆర్ తో సినిమా చెయ్యలేకపోయాడు. ఒకటి మిస్ అయినా ఇంకొకటి దొరికింది అన్నట్లు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్న బుచ్చిబాబు, రామ్ చరణ్ తో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఎన్టీఆర్ కి చెప్పిన కథనే చరణ్ కి తగ్గట్లు మార్పులు చేసి బుచ్చిబాబు ఈ ప్రాజెక్ట్ ని తెరకెక్కించబోతున్నాడు. రెండో సినిమాకే రామ్ చరణ్ లాంటి పాన్ ఇండియా హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేసాడు అంటే బుచ్చిబాబు క్రెడిబిలిటీ ఇండస్ట్రీ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇటివలే చరణ్-బుచ్చిబాబు మూవీ గ్రాండ్ గా అనౌన్స్ కూడా అయ్యింది.

Exit mobile version