Site icon NTV Telugu

Ram Charan – Upasana : మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుకలో మెగా హంగామా!

Ramcharan Upasana Secind Baby

Ramcharan Upasana Secind Baby

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ హ్యాపీ న్యూస్‌తో మెగా ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయింది. దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసనకు సీమంతం వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు.

Also Read : Bandla Ganesh: బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి బ్రేక్‌ తీసుకున్నాను.. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు

ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. ఉపాసన తన సోషల్ మీడియాలో ఈ వేడుక వీడియో ని షేర్ చేస్తూ “డబుల్ సెలబ్రేషన్స్” అంటూ క్యాప్షన్ పెట్టింది. వీడియో లో చరణ్-ఉపాసన జంటతో పాటు చిరంజీవి, సురేఖ, నిహారిక, అల్లు కుటుంబ సభ్యులు అందరూ కనిపించారు. ఇప్పటికే ఈ దంపతులకు 2023 జూన్‌లో పాప క్లీంకార పుట్టగా, రెండు సంవత్సరాల తర్వాత మళ్లీ వారి ఇంటికి మరో సంతోషం రాబోతోంది. ఈ హ్యాపీ న్యూస్ తెలిసిన వెంటనే మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. “సింబా వస్తున్నాడు” అంటూ కామెంట్ పెడుతూ మెగా ఫ్యాన్స్ జోష్ చూపిస్తున్నారు. మెగా ఫ్యామిలీకి ఇది నిజంగా డబుల్ సెలబ్రేషన్ టైమ్ అని చెప్పవచ్చు !

 

Exit mobile version