ఈరోజు రాత్రి ముంబైలో జరగనున్న భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సన్నద్ధమవుతోంది. అక్కడ ఈవెంట్ కోసం ఏర్పాట్లను పర్యవేక్షించడానికి చిత్ర బృందం మొత్తం ఇప్పటికే ముంబైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో ముంబై విమానాశ్రయంలో దిగినప్పటి నుంచి ఇప్పటి వరకూ ‘ఆర్ఆర్ఆర్’ టీం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా రామ్ చరణ్, ఎన్టీఆర్ కు సంబంధించిన ఆసక్తికరమైన ఫోటోను “బ్యాక్ స్టేజ్ బ్రొమాన్స్” అంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు మేకర్స్. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ముచ్చట్లలో మునిగిపోయిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read also : ఇది కదా మనకి కావాల్సిన మాస్… బాలయ్యతో రవితేజ !
“బ్యాక్‌స్టేజ్ బ్రోమాన్స్… #RoarofRRRinMumbai కోసం సిద్ధమవుతోంది” అంటూ టీమ్ ఈ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసింది. తారక్ బ్లూ రౌండ్ నెక్ టీ షర్ట్, జీన్స్, క్యాప్ ధరించాడు. మరోవైపు రామ్ చరణ్ తెల్లటి రౌండ్ నెక్ టీ షర్ట్, కార్గో జీన్స్ ధరించాడు. రాజమౌళి దర్శకత్వం వహించిన మాగ్నమ్ ఓపస్ మూవీ “ఆర్ఆర్ఆర్”లో అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియ శరన్, ఒలివియా మోరిస్ తదితరులు నటిస్తున్నారు. 2022 జనవరి 7న విడుదల కాబోతోంది ఈ చిత్రం.
