NTV Telugu Site icon

RC 16 : రామ్ చరణ్ 16.. కథ, నేపథ్యం ఏంటో చేప్పేసిన డీవోపీ

Rc16

Rc16

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఆశించిన విజయాన్ని అందుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో చేతులు కలిపాడు రామ్ చరణ్. చెర్రీ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్నఈ చిత్ర షూటింగ్ జెట్ స్పీడ్‌లో చేస్తున్నాడు. తాజాగా RC16 షూటింగ్ కొత్త షెడ్యూల్ మొదలైంది. నైట్ షెడ్యూల్‌లో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తోంది చిత్ర యూనిట్.

Also Read : DishaPatani : చూపు తిప్పుకోనివ్వని ‘దిశా పఠాని’ లేటెస్ట్ ఫొటోస్

వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారట. బుచ్చిబాబు కూడా పక్కా ప్లానింగ్‌తో వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కోసం భారీ సెట్‌లు వేయించాడు. రెండు రోజుల క్రితం చరణ్ తనయ క్లింకార RC 16 షూట్ వచ్చినప్పటి ఫోటోలను షేర్ చేసాడు చరణ్. తాజాగా ఈ సినిమా షూట్ ఓ క్రికెట్ గ్రౌండ్ లో షూటింగ్ జరుగుతుండగా ఫ్లడ్ లైట్, నైట్ షూటింగ్, క్రికెట్ అంటూ హ్యాష్ ట్యాగులతో ఈ సినిమాకు డీవోపీ గా పనిచేస్తున్న రత్నవేలు ఎక్స్ వేదికగా షూటింగ్ ఫోటోలు షేర్ చేసాడు. ఈ సినిమా స్పోర్ట్స్ నేపథ్యంలో రానుందని చెప్పాకనే చెప్పాడు రత్నవేలు.  అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈసారి దసరా లేదా దీపావళి సీజన్లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో చరణ్ క్యారెక్టర్ రంగస్థలం సినిమాలో చిట్టిబాబు కంటే మరింత పవర్ ఫుల్‌గా ఉంటుందనే టాక్ ఉంది. దీంతో మెగాభిమానులు ఈ సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.