Site icon NTV Telugu

అమెజాన్ లో అల్లాడిస్తున్న ‘రామ్- అసుర్’

ram-asur

ram-asur

అభినవ్ సర్దార్, చాందనీ, రామ్ కార్తీక్, షెర్రీ అగర్వాల్ లీడ్ రోల్స్ గా నటించిన చిత్రం ‘రామ్- అసుర్’. వెంకటేశ్ త్రిపర్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కరోనా కారణంగా ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయినా ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. దీంతో అమెజాన్ లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. కృత్రిమ వజ్రం తయారీపై తెరెకెక్కిన ఈ చిత్రంలో పీరియాడిక్ లవ్ స్టోరీతో పాటూ, కాంటెంపరరీ ప్రేమకథ కూడా ఉండడంతో ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. భీమ్ సిసిరోలియో స్వరాలు ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకున్నాయి. ఏం చేశావో ఏమో మాయ పాట యూత్ కాలర్ ట్యూన్ గా మారిపోయింది. ప్రేమ, భావోద్వేగం, యాక్షన్, ఎంటర్టైన్మెంట్ మళితమైన రామ్ అసుర్ ఈ సంక్రాంతికి కుటుంబంతో చూడడానికి మంచి టైమ్ పాస్.

Exit mobile version