Rakul Preet : పూరీ జగన్నాథ్ కు ఇప్పుడు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. ఒకప్పుడు చాలా మంది హీరోలను స్టార్లను చేసిన చరిత్ర ఆయనకుంది. కానీ అదంతా గతం. ఇప్పుడు స్టార్ హీరోలు ఆయన్ను పక్కన పెట్టేస్తున్నారు. అయితే ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ కూడా పూరీ జగన్నాథ్ సినిమాలో ఛాన్స్ ఇస్తే వద్దని చెప్పేసిందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పింది. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఎన్నో సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
Read Also : Vishnupriya : విష్ణుప్రియకు హైకోర్టులో స్వల్ప ఊరట..!
‘నేను చదువుకుంటున్న టైమ్ లోనే మోడలింగ్ చేశాను. నా మోడలింగ్ ఫొటోలు చూసి అప్పట్లో నాకు ఓ కన్నడ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. నాకు సౌత్ ఇండస్ట్రీ గురించి పెద్దగా ఏమీ తెలియదు. కన్నడ సినిమా చేశాక.. పూరీ జగన్నాథ్ తన మూవీలో ఛాన్స్ ఇచ్చారు. 70 రోజులు డేట్స్ అడిగారు. కానీ చదువు డిస్టర్బ్ అవుతుందని నో చెప్పాను. కావాలంటే ఓ నాలుగు రోజులు వస్తానన్నాను. అప్పట్లో సినిమాకు ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలియదు. పైగా పూరీ జగన్నాథ్ స్టార్ డైరెక్టర్ అని కూడా తెలియదు. అలా సౌత్ ఇండస్ట్రీ గురించి తెలియక చాలా సినిమాలు వదిలేసుకున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది రకుత్ ప్రీత్ సింగ్.