తెలుగు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకపరిచయాలు అవసరం లేదు.. ఒకప్పుడు వరుస హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడుకు ఈ మధ్య తెలుగులో మంచి అవకాశాలు రాలేదు.. దాంతో ఈ అమ్మడు ప్రస్తుతం బాలివుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.. నేడు రకుల్ ప్రీత్ బర్త్ డే.. ఈ సందర్బంగా ఆమె తన స్నేహితులు, సన్నిహితుల నడుమ గ్రాండ్ గా ఆమె బర్త్ డే సెలెబ్రషన్స్ జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్ ఫోటోలు, వీడియోలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఖతార్ కు ఓ ఈవెంట్ కోసం వెళ్లిన ఈ ముద్దుగుమ్మ అక్కడే కేక్ కట్ చేసినట్టు తెలుస్తోంది. తన భాయ్ ఫ్రెండ్ కూడా వేడుకకు హాజరై సందడి చేశారు… ఈ అమ్మడు 1990 అక్టోబర్ 10న పంజాబీ ఫ్యామిలీలో జన్మిచింది. న్యూ ఢిల్లీకి చెందిన కుల్విందర్ సింగ్,రాజేందర్ కౌర్ దంపతులకు జన్మించింది. తండ్రి ఆర్మీ ఆఫీసర్. దీంతో రకుల్ చదువు కూడా ఆర్మీ స్కూల్ లోనే జరిగింది. ఆమె సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నారు… కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ సెలెబ్రేషన్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది..
ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్బంగా ఆమె ఫ్యాన్స్, సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా విషెష్ తెలుపుతున్నారు.. ఈ సందర్బంగా బాలయ్య బ్యూటీ ప్రగ్యా రకుల్ సెలెబ్రేషన్ కు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. రకుల్ తో, ప్రగ్యా కలిసి ఉన్న కొన్ని ఫొటోలను పంచుకుంది. క్యూట్ ఫొటోల్లో బర్త్ డే గర్ల్ బ్యూటీఫుల్ గా మెరిసింది. ఆ ఫొటోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి… రకుల్ ప్రీత్ సింగ్ మొన్నటి వరకు బాలీవుడ్ సందడి చేసింది. గతేడాది వరుస చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ పెద్దగా హిట్ పడలేదు. ఇదిలా ఉంటే.. మళ్లీ సౌత్ సినిమాలపై దృష్టి పెట్టింది.. పలు సినిమాల్లో నటిస్తుంది..
