Site icon NTV Telugu

Rakul Pic : రెడ్ బికినీలో రచ్చ… సెగలు రేపుతున్న బ్యూటీ

Rakul-Preeth-Singh

పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ను సౌత్ ప్రేక్షకులు వెండి తెరపై చూడక చాలా రోజులవుతోంది. ‘కొండపొలం’ తరువాత ఆమె నటించిన సినిమాలేవీ విడుదల కాలేదు. దీంతో రకుల్ ను ఆమె అభిమానులు చాలా మిస్ అవుతున్నారు. అందుకేనేమో తనను మిస్ అవుతున్న వారి కోసమే అన్నట్టుగా వరుసగా బికినీ పిక్ లతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది రకుల్. తాజాగా రెడ్ బికినీలో ఆమె షేర్ చేసిన పిక్ కుర్రాళ్లలో సెగలు రేపుతోంది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో రకుల్ ఈ పిక్ ను షేర్ చేయగా, అదిప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇంతకుముందు కూడా రకుల్ యెల్లో కలర్ బికినీలో ఉన్న పిక్ ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది.

Read Also : AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు

ఇక రకుల్ సినిమాల విషయానికొస్తే… ఈ సంవత్సరం ఆమె నటించిన కొన్ని ఆసక్తికర సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. లక్ష్య రాజ్ నెక్స్ట్ మూవీ ‘ఎటాక్‌’లో జాన్ అబ్రహంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ నటించనుంది. ఆమె ఇతర ప్రాజెక్ట్‌లలో సిద్ధార్థ్ మల్హోత్రాతో ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ‘థాంక్ గాడ్’, ఆయుష్మాన్ ఖురానాతో అనుభూతి కశ్యప్ దర్శకత్వం వహించిన ‘డాక్టర్ జి’ సినిమాల్లో నటిస్తోంది. అంతేకాకుండా రవికుమార్ తమిళ్ మూవీ ‘అయాలాన్‌’లో కూడా రకుల్ ప్రీత్ భాగం అవుతుంది.

Exit mobile version