Rakul Preet Singh: ప్రస్తుతం సమాజంలో మనుషులు.. పక్క మనుషుల మీదకంటే జంతువుల మీదనే ప్రేమను చూపిస్తున్నారు. అందులో కూడా తప్పు లేదు. మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు..కానీ జంతువులు ఎప్పుడు ఒకేలా ఉంటాయి. ముఖ్యంగా డాగ్స్ విశ్వాసానికి మారుపేరు. ప్రస్తుతం జనాలు వాటిని డాగ్స్ కూడా చూడడంలేదు.. తమ బిడ్డలను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో.. వాటిని కూడా అంతే ప్రేమతో చూసుకుంటున్నారు. ఇక సెలబ్రటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామ్ నుంచి చరణ్ వరకు నిత్యం పెట్స్ తోనే కనిపిస్తూ ఉంటారు.
ఇక తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇంట విషాదం చోటుచేసుకొంది. 16 ఏళ్ళ నుంచి తన సొంత తమ్ముడిగా పెంచుకుంటున్న డాగ్ మృతి చెందింది. దీంతో ఆమె ఎంతో ఎమోషనల్ కు గురి అయ్యింది. ఆ డాగ్ ను ఆమె ఎంత మిస్ అవుతుందో తెలుపుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. “బ్లోసమ్ .. 16 ఏళ్ల క్రితం నువ్వు మా ఇంటికి వచ్చావ్.. నీతో పాటే నేను పెరిగాను.. ఇన్నిరోజులు ఎంతో సంతోషంగా జీవితాన్ని గడిపావ్.. అంతే సంతోషంగా కన్నుమూశావ్.. నేనెప్పుడూ మిస్ అవుతాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి.. నువ్ ఎక్కడున్నా బాగుండాలి” అంటూ పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్ పై పెట్ లవర్స్ తమదైన రీతిలో రకుల్ ను ఓదారుస్తున్నారు. తమ పెట్ పోతే ఎంత బాధగా ఉంటుందో తెలుపుతూ రకుల్ ను ధైర్యంగా ఉండాలంటూ కోరుతున్నారు.
