Rakul Preet : రీసెంట్ గా విరాట్ కోహ్లీ ఓ నటి విషయంలో దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. అలా అని ఆ నటితో విరాట్ మాట్లాడింది లేదు.. కనీసం బయట ఇద్దరూ కలిసింది కూడా లేదు. దానికి కారణం ఒకే ఒక్క లైక్. అవును.. టీమిండియా స్టార్ క్రికెటర్ గా విరాట్ కు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇన్ స్టాలో ఇండియాలోనే అత్యధికి ఫాలోవర్లు ఉన్నది విరాట్ కే. అలాంటి విరాట్ రీసెంట్ గా నటి అవనీత్ కౌర్ రీల్ కు ఒక లైక్ కొట్టాడు. ఆ దెబ్బతో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి.
Read Also : Arshdeep Singh: తల్లికి లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చిన యువ క్రికెటర్..
చివరకు విరాట్ కూడా స్పందించాడు. అది టెక్నికల్ ఇష్యూతో జరిగిందంటూ తెలిపాడు. అయినా సరే రూమర్లు మాత్రం ఆగట్లేదు. దీనిపై ఇప్పటికే చాలా మంది స్పందించారు. తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ కూడా స్పందించింది. మనం ఎంత ఖాళీగా ఉన్నామో దీన్ని బట్టి అర్థం అవుతోంది. విరాట్ లైక్ కొట్టడం వల్ల ఆమెకు 2 మిలియన్ల మంది ఫాలోవర్స్ పెరిగారంటూ ఏకి పారేసింది.
విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీ ఒక లైక్ కొట్టినా సరే అది ఇంత పెద్ద న్యూస్ అవడం అంటే.. మనం ఎంత జాబ్ లెస్ గా ఉన్నామో అర్థం అవుతోంది. దయచేసి ఇలాంటి వాటిని పెద్దది చేయొద్దు. ఎందుకంటే అది ఒక వ్యక్తి వ్యక్తిగత అభిప్రాయం. ఒక సెలబ్రిటీ ఏం చేసినా దాన్ని ఇంత మంది న్యూస్ చేసేస్తున్నారంటే. ఇది అనవసర రాద్దాంతం’ అంటూ రకుల్ సీరియస్ వ్యాఖ్యలు చేసింది.
Read Also : AM Ratnam : కళ్లు తిరిగి పడిపోయిన ’వీరమల్లు’ నిర్మాత.. రిలీజ్ టెన్షనా..
