NTV Telugu Site icon

Rakul- Jackky Wedding : రకుల్‌-జాకీ భగ్నానీకి ప్రధాని స్పెషల్‌ విషెష్‌.. వైరల్ అవుతున్న లేఖ..

Rakul Modi

Rakul Modi

రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ దాదాపు నాలుగేళ్లు ప్రేమించుకున్నారు.. తాజాగా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు.. ఫిబ్రవరి 21న వీరిద్దరు మూడుమూళ్లు బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే గోవాలో గ్రాండ్గా వీరి పెళ్లి వేడుక జరిగింది.. సన్నీహితులు, కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా పెళ్లి జరిగింది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా వీరికి భారత ప్రధాని మోదీ కూడా శుభాకాంక్షలు చెబుతూ లేఖ రాశారు..

ఇండియాలోనే వీరు పెళ్లి చేసుకోవడాన్ని చాలా మంది ప్రశంసిస్తున్నారు. అయితే వారి ఈ నిర్ణయం వెనకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇండియాలోనే పెళ్లి చేసుకుని మన టూరిజం అభివృద్ధికి సహకరించాలని మోదీ కోరారట. ఆయన సూచన మేరకు ఇక్కడే గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.. వీరి వివాహ వేడుకకు శిల్పా శెట్టి, రాజ్కుంద్రా, ఆయుష్మాన్, అర్జుణ్ కపూర్, రవీణా టాండన్ వంటి బాలీవుడ్ స్టార్స్, ప్రముఖులు హాజరయ్యారు. అయితే వీరి పెళ్లికి ప్రధాని మోదీకి కూడా ఆహ్వానం అందింది. కానీ తన బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ రకుల్-జాకీ పెళ్లికి హజరకాలేకపోయారు.

ఇక ఈ నేపథ్యంలో ఈ జంటకు తాజాగా ఆయన ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. మోదీ తన ఆఫీషియల్ ఎక్స్ పోస్ట్లో కొత్త జంటను శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ నోట్ షేర్ చేశారు..ఈ నోట్ పై రకుల్, జాకీలు స్పందించారు. మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు మాకు ఎంతో ముఖ్యమైనవి. చాలా కృతజ్ఞతలు మోదీ గారు అని తెలిపారు.. రెండు సంప్రదాయాల్లో వీరి పెళ్లి జరిగినట్టు తెలుస్తోంది. పంజాబీ ఆనంద్ కరాజ్, సింధి సంప్రదాయల్లో పెళ్లి చేసుకోనున్నట్టు మొదటి నుంచి అందుతున్న సమాచారం. ఇరు సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ వేడుక జరిగినట్టు పెళ్లి ఫొటోలు చూస్తుంటే అర్థమవుతుంది… వీరిద్దరికీ పలువురు సిని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు..