ఈ మధ్య కాలంలో ఒక చిన్న సినిమాకి కూడా సాలిడ్ ప్రమోషన్స్ చేస్తూ బజ్ ని జనరేట్ చేస్తున్నారు. ప్రమోషన్స్ బాగా చేస్తే మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి, ఆ తర్వాత టాక్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. చిన్న సినిమాలకి, పెద్ద సినిమాలకి మాత్రమే కాదు డబ్బింగ్ సినిమాలకి కూడా ఇదే వర్తిస్తుంది. ఈ విషయాన్ని కంప్లీట్ గా మర్చిపోయినట్లు ఉన్నారు సప్త సాగరాలు దాటు సైడ్ బె టీమ్. మోస్ట్ టాలెంటెడ్ యంగ్ కన్నడ హీరో రక్షిత్ శెట్టి రీజనల్ మార్కెట్ నుంచి పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకునే వరకూ ఎదిగాడు. లేటెస్ట్ గా ‘సప్త సాగర దాచే ఎల్లో సైడ్ A’ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు రక్షిత్ షెట్టు. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ కన్నడలో సూపర్ హిట్ అయ్యి… అక్కడి నుంచి తెలుగులోకి డబ్ అయ్యి ఇక్కడ కూడా మంచి హిట్ గా నిలిచింది.
ప్యూర్ లవ్ స్టోరీ కావడంతో యూత్ సప్త సాగరాలు దాటి సైడ్ A సినిమాని బాగా ఓన్ చేసుకున్నారు. దీంతో పార్ట్ 2 మూవీ మరింత హిట్ అవుతుందని మేకర్స్ ఈ సినిమాని అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 17కి వాయిదా పడిన సప్త సాగరాలు దాటి సైడ్ B రిలీజ్ కి సిద్ధంగా ఉంది. పార్ట్ 1 హిట్ కాబట్టి దానికన్నాకొంచెం ఎక్కువగా పార్ట్ 2ని ప్రమోట్ చేస్తే చాలు ఆల్రెడీ పాజిటివ్ బజ్ ఉంది కాబట్టి నవంబర్ 17న రక్షిత్ శెట్టి ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్లే అనుకున్నారు కానీ రెండు రోజుల్లో రిలీజ్ ఉన్నా కూడా ఈ సినిమా బజ్ జనరేట్ చేయడంలో ఫెయిల్ అవుతోంది. తెలుగులో అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక రక్షిత్ ని, సప్త సాగరాలు దాటి సైడ్ B సినిమాని మౌత్ టాక్ మాత్రమే కాపాడాలి.
