NTV Telugu Site icon

Rakshit Shetty: సెప్టెంబర్ 22న రిలీజ్ కి రెడీ… ట్రైలర్ ఎప్పుడు సర్?

Rakshit Shetty Side A

Rakshit Shetty Side A

అతడే శ్రీమన్నారాయణ, 777 చార్లీ సినిమాలతో తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు కన్నడ హీరో రక్షిత్ శెట్టి. ఒకప్పుడు రష్మిక మాజీ ప్రేమికుడిగా మాత్రమే పరిచయం ఉన్న రక్షిత్ శెట్టి, ఇప్పుడు ప్రామిసింగ్ హీరోగా తెలుగులో కూడా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా 777 చార్లీ సినిమాతో తెలుగు మాత్రమే కాకుండా పాన్ ఇండియాని అట్రాక్ట్ చేసాడు. హీరోగా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా కూడా సినిమాలు చేసే రక్షిత్ శెట్టి నుంచి ఒక సినిమా వస్తుంది అంటే అది పక్కా బాగుంటుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది. తనకంటూ అంత క్రెడిబిలిటీ సంపాదించుకున్న రక్షిత్ శెట్టి… క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ కథలకి మాత్రమే చేస్తాడు. లేటెస్ట్ గా రక్షిత్ శెట్టి నటిస్తూ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’ కర్ణాటకలో సూపర్ హిట్ అయ్యింది. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి క్లాసిక్ లవ్ స్టోరీ అనే పేరు తెచ్చుకుంది. ఈ మూవీలో మను అండ్ ప్రియాల ప్రేమకథని దర్శకుడు హేమంత్ రావు బ్యూటిఫుల్ గా నరేట్ చేసాడు.

చరణ్ రాజ్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో రిలీజ్ చేస్తుంది. ‘సప్త సాగర దాచే ఎల్లో’ రైట్స్ ని తీసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈరోజు ఈ మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది. ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ ని అనౌన్స్ చేసిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సెప్టెంబర్ 22న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరి రిలీజ్ కి వారం రోజులే ఉంది కాబట్టి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసి ట్రైలర్ ని రిలీజ్ చేస్తే మంచి బజ్ జనరేట్ అవుతుంది. ఆ తర్వాత ఒక గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని పెట్టి రక్షిత్ శెట్టిని హైదరాబాద్ రప్పిస్తే చాలు ‘సప్త సాగరాలు దాటి’ సినిమా జనాల్లోకి వెళ్లిపోతుంది. ఈ మోడరన్ క్లాసిక్ లవ్ స్టోరీ తెలుగు ఆడియన్స్ ని ఎంతవరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.

Show comments