NTV Telugu Site icon

Rakshit Shetty: కన్నడలో బ్లాక్ బస్టర్ అయిన మూవీ తెలుగులో రిలీజ్ అవుతుంది

Rakshit Shetty

Rakshit Shetty

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఆడియన్స్ పరిచయం అయిన యంగ్ హీరో ‘రక్షిత్ శెట్టి’. అతడే శ్రీమన్నారాయణ, చార్లీ సినిమాలతో రక్షిత్ శెట్టి తెలుగు ఆడియన్స్ కి చాలా దగ్గరయ్యాడు. చార్లీ సినిమాతో అయితే ఏకంగా పాన్ ఇండియా హిట్ కొట్టాడు రక్షిత్ శెట్టి. క్వాలిటీ ఉండే సినిమాలని, కంటెంట్ ఓరియెంటెడ్ కథలకి మాత్రమే ఓకే చెప్పే రక్షిత్ శెట్టి… లేటెస్ట్ గా నటించిన సినిమా ‘సప్త సాగర దాచే ఎల్లో’. రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చి సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఒక మంచి సినిమాగా పేరు తెచ్చుకున్న ఈ మూవీలో మను అండ్ ప్రియాల ప్రేమకథని దర్శకుడు హేమంత్ రావు బ్యూటిఫుల్ గా నరేట్ చేసాడు. కావులధారి లాంటి థ్రిల్లర్ సినిమాని ఆడియన్స్ ని ఇచ్చిన హేమంత్ లవ్ స్టోరీని కూడా అంతే అందంగా చూపించాడు.

‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాకి ప్రాణంగా నిలిచింది చరణ్ రాజ్ మ్యూజిక్ ప్రాణం పోసింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమా నుంచి మొదటి పార్ట్ ‘సైడ్ A’గా ఇప్పుడు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది, ఇందులో నుంచి సెకండ్ పార్ట్ ‘సైడ్ B’ అక్టోబర్ 20న రిలీజ్ కానుంది. ఎక్కడ ఏ సినిమా హిట్ అయినా దాన్ని డబ్ చేసి రిలీజ్ చేయడం లేదా రీమేక్ చేయడం ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేదే. ఒక మంచి సినిమాని మన ఆడియన్స్ కి కూడా చూపించాలి అని ‘సప్త సాగర దాచే ఎల్లో’ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో రిలీజ్ చేస్తుంది. ‘సప్త సాగర దాచే ఎల్లో’ రైట్స్ ని తీసుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈరోజు ఈ మూవీ టైటిల్ అండ్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయనున్నారు. మరి ఈ మోడరన్ క్లాసిక్ లవ్ స్టోరీ తెలుగు ఆడియన్స్ ముందుకి ఎప్పుడు వస్తుందో చూడాలి.