Site icon NTV Telugu

Rakshasa: ఇంట్రెస్టింగ్ గా రాక్షస ట్రైలర్

Raksasa Trailer

Raksasa Trailer

కన్నడ హీరో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రాన్ని శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒరిజినల్ వెర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన వేద చిత్రాన్ని విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ రాక్షస తెలుగు రైట్స్ ను దక్కించుకున్నారు. కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ తెలుగు ట్రైలర్ ను శనివారం రిలీజ్ చేశారు. ఇందులో ప్రజ్వల్ దేవరాజ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. కూతురుపై ఉన్న ప్రేమతో ఇందులో హీరో చేసిన చర్యలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. నోబిన్ పాల్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచింది.

Hydra Prajavani: నేడు బుద్ధ భవన్‌లో హైడ్రా ప్రజావాణి!

లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ టైమ్ లూప్ హారర్ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై బజ్ ను పెంచగా, తాజాగా విడుదలైన టైలర్ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఈ సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ..”ఈ చిత్రం ప్రేక్షకులకు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తుంది. ప్రజ్వల్ దేవరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కు మంచి ఆదరణ దక్కుతోంది. సినిమా కూడా అందరూ ఇష్టపడేలా ఉంటుంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. బాగా ఈ చిత్రానికి కూడా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతుందని నమ్మకం ఉంది” అని చెప్పారు. ఈ చిత్రంలో అరుణ్ రాథోడ్, శ్రీధర్, గౌతమ్, సోమశేఖర్, విహాన్ కృష్ణ తదితరులు నటిస్తున్నారు.

Exit mobile version