NTV Telugu Site icon

Rakshasa Kavyam: అరడజను సినిమాలు.. వెనక్కి తగ్గి అక్టోబర్ 13న “రాక్షస కావ్యం”

Rakshasa Kavyam

Rakshasa Kavyam

Rakshasa Kavyam is now releasing on October 13: అరడజను సినిమాలు అక్టోబర్ 6న రిలీజ్ కి సిద్దమైన నేపథ్యంలో అదే రోజున రిలీజ్ కావాల్సిన “రాక్షస కావ్యం” సినిమా మరో వారం ఆలస్యంగా అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అయింది. ప్రేక్షకులకు సిల్వర్ స్క్రీన్ మీద సరికొత్త సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేందుకు పోస్ట్ ప్రొడక్షన్ లో మరింత క్వాలిటీ కోసమే వారం రోజులు “రాక్షస కావ్యం” మూవీ రిలీజ్ ను అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని మేకర్స్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. అభయ్ నవీన్, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి ప్రధాన పాత్రల్లో నటించిన “రాక్షస కావ్యం” సినిమాను గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కల్యాణ్ నిర్మిస్తున్నారు.

Archana Gautam: నటి అర్చనపై దాడి.. జుట్టు లాగి అసభ్య ప్రవర్తన!

నవీన్ రెడ్డి, వసుందర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ “రాక్షస కావ్యం” సినిమాను దర్శకుడు శ్రీమాన్ కీర్తి డైరెక్ట్ చేశారు. రా అండ్ రస్టిక్ మూవీగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నా ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమ్మ పాట, విలన్స్ ఆంథెమ్ పాటలు ఇన్ స్టంట్ హిట్ కాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేసిన “రాక్షస కావ్యం” ట్రైలర్ సినిమా మీద మరిన్ని అంచనాలు పెంచింది. ఇక అక్టోబర్ 13న థియేటర్స్ లో కలుద్దామని మూవీ టీమ్ చెబుతోంది. రుషి కోనాపురం