NTV Telugu Site icon

Rajshri Productions: వారసుల చిత్రానికి రంగం సిద్థం!

Hero

Hero

 

హిందీ చిత్రసీమలో రాజశ్రీ ప్రొడక్షన్స్ కు గొప్ప చరిత్ర ఉంది. ఏడున్నర దశాబ్దాలుగా ఈ సంస్థ చిత్ర నిర్మాణం, పంపిణీతో పాటు సినిమా సంబంధిత ఇతర కార్యక్రమాలనూ నిర్వహిస్తోంది. ఆ ప్రొడక్షన్ హౌస్ లో నటించే అవకాశం రావడం అంటే ఆర్టిస్టులకు మెరిట్ సర్టిఫికెట్ లభించినట్టే అని పలువురు భావిస్తుంటారు. రాజశ్రీ సంస్థ నిర్మించిన చిత్రాలన్నీ చక్కని విజయం సాధించడమే అందుకు కారణం. విశేషం ఏమంటే… ఆ సంస్థ నిర్మించబోతున్న తాజా చిత్రంలో ధర్మేంద్ర మనవడు, సన్నీ డియోల్ తనయుడు రాజ్ వీర్ డియోల్ హీరోగా నటించబోతున్నాడు.

 

 

అలానే ప్రముఖ నటి పూనమ్ థిల్లర్, నిర్మాత అశోక్ థకేరియా కుమార్తె పలోమా హీరోయిన్ గా నటించబోతోంది. వీరిద్దరికీ ఇది డెబ్యూ మూవీ. మరో విశేషం ఏమంటే ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జాత్యా కొడుకు అవినీశ్‌ ఎస్ బర్జాత్యా దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జులై మాసంలో మొదలు కానుంది. మోడ్రన్ రిలేషన్స్ ను చూపించే ఈ మూవీ లావిష్ డెస్టినేషన్ వెడ్డింగ్ నేపథ్యంలో తెరకెక్కబోతోంది.

Show comments