NTV Telugu Site icon

Rajinikanth: జైలర్ కాదు… ఇప్పుడు గవర్నర్ రజనీకాంత్‌‌..?

Rajinikanth Governor

Rajinikanth Governor

Rajinikanth To Be Appointed As Governor Soon: ఒకసారి పొలిటికల్ ఎంట్రీకి సిద్దమై చివరి నిముషంలో వెనక్కి తగ్గారు తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, అయితే రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారని ప్రచారం మాత్రం అడపాదడపా తెర మీదకు వస్తూనే ఉంది. ఇక జైలర్ సక్సెస్ తో ఉన్న ఆయన బీజేపీకి మద్దతుగా గతంలో కొన్ని కామెంట్లు చేయడం ఇటీవల బీజేపీ సీఎం యోగి కాళ్ళపై పడి ఆశీస్సులు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇక రజనీకాంత్ గవర్నర్ కాబోతున్నారని జరుగుతున్న ప్రచారంపై ఆయన సోదరుడు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. రజనీకి గవర్నర్ పదవి దేవుడి చేతుల్లో ఉందని చెబుతూ ఊహాగానాలకు మరింత ఆజ్యం పొసేశారని చెప్పాలి. అయితే ఆయన మాట్లాడుతూ ఆయన రాజకీయాల్లోకి మాత్రం రాబోరని కుండబద్దలు కొట్టేశారు.

బిగ్ బాస్ 7 కంటెస్టెంట్లకి దిమ్మతిరిగే రెమ్యునరేషన్లు.. ఒక్కొక్కరికి ఎన్ని లక్షలో తెలుసా?

తాజాగా మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న సత్యనారాయణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో రజనీకాంత్ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని పేర్కొన్న సత్యనారాయణ రజనీకి గవర్నర్ పదవి మాత్రం దేవుడి చేతుల్లోనే ఉందన్నారు. ఇటీవల ఉత్తర భారతదేశంలో పర్యటించిన రజనీకాంత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్, ఝార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో భేటీ కావడంతో ఈ గవర్నర్ అంశం మళ్లీ తెరపైకి వచ్చినట్లు అయింది. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలకు స్పందించిన ఆయన ర‌జినీకి గవర్నర్‌ పదవి రావాలని ఎలాంటి ఆశలు పెట్టుకోలేదనీ, ఒకవేళ వస్తే మాత్రం సంతోషిస్తామని అన్నారు. అయితే ర‌జినీ సైతం గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించ‌ర‌ని ఆయ‌న చెప్పడం, ఇటీవ‌ల ప‌లువురు రాజ‌కీయ నేత‌ల‌ను క‌ల‌వ‌డం, స‌త్య‌నారాయ‌ణ రావు వ్యాఖ్య‌లు అన్నీ చూస్తుంటే రజినీకి గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి ద‌క్క‌నుంద‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూరుతుందని అంటున్నారు.

Show comments