Site icon NTV Telugu

Rajini: ఇక్కడ సౌండ్ లేదు కానీ అక్కడ రికార్డులు చెల్లాచెదురు అవ్వడం పక్కా

Jailer

Jailer

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘జైలర్’. పేరుకి పాన్ ఇండియా సినిమా అయినా తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఆశించిన రేంజ్ బజ్ ని జైలర్ సినిమా జనరేట్ చేయలేకపోతోంది. ‘కావాలి’ సాంగ్ అన్ని భాషల్లో హిట్ అయ్యింది కానీ ఈ ఒక్క పాట రజినీ సినిమాకి ఉండాల్సిన హైప్ ని క్రియేట్ చేయడానికి సరిపోవట్లేదు. తెలుగులో అయితే జైలర్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జైలర్ సినిమా రిలీజ్ అయిన ఒక్క రోజు తర్వాత చిరు భోళా శంకర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తుండడంతో మొదటి రోజు జైలర్ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఉన్నా రెండో రోజే అందులో సగం ఎగిరిపోయే అవకాశం కనిపిస్తోంది. ఈ విషయం అర్ధం చేసుకొనే జైలర్ మేకర్స్ తెలుగులో ఎక్కువగా ప్రమోషన్స్ ని కూడా చేస్తున్నట్లు లేరు. సాంగ్స్ ని తెలుగులో డబ్ చేసి వదులుతున్నారు కానీ మేకర్స్ ఎలాంటి స్పెషల్ ప్రమోషన్స్ చెయ్యట్లేదు.

మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లు కూడా జైలర్ సినిమాలో నటించారు కానీ కన్నడ మలయాళ భాషల్లో జైలర్ సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ప్రిడిక్షన్ ప్రకారం చూస్తే జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ కెరీర్ ముందెన్నడూ చూడనంత వీక్ ఓపెనింగ్స్ ని రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ వీక్ ఓపెనింగ్స్ అనేది తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే. తమిళనాడులో మాత్రం ఎర్త్ షాటరింగ్ ఓపెనింగ్స్ ని రాబట్టడానికి రజినీ రెడీగా ఉన్నాడు. జైలర్ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి, జైలర్ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకి వచ్చినా సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ కూడా బయటకి వచ్చేస్తే జైలర్ సినిమాపై అంచనాలు మరింత పెరగనున్నాయి. రజినీ నుంచి సరైన సినిమా కోసం వెయిట్ చేస్తున్న తమిళ్ ఫ్యాన్స్ ఆగస్టు 10న కోలీవుడ్ బాక్సాఫీస్ పునాదులని కదిలించడం గ్యారెంటీగా కనిపిస్తోంది. కోలీవుడ్ వర్గాల ప్రిడిక్షన్ ప్రకారం జైలర్ సినిమా 350 కోట్లకి పైగా రాబట్టే అవకాశం ఉంది.

Exit mobile version