మూడున్నర దశాబ్దాలుగా ఎపిటోమ్ ఆఫ్ స్టైల్ గా పేరు తెచ్చుకున్న ఏకైక స్టార్ హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఆయన డైలాగ్ డెలివరీ, స్వాగ్, స్టైల్, గ్రేస్, మ్యానరిజమ్స్… ఇలా రజినీకి సంబంధించిన ప్రతి ఎలిమెంట్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తాయి. ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమాగా ప్రేక్షకులని అలరిస్తున్న రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జైలర్’. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై కోలీవుడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఉన్నాయి. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ‘జైలర్’ మూవీ కోసం తలైవ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రజినీకాంత్ ‘ముత్తువేల్ పాండియన్’గా కనిపించనున్న జైలర్ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లోనే కాదు సౌత్ ఇండియా ఆడియన్స్ లో కూడా భారి అంచానలు ఉన్నాయి. రజినీ, మోహన్ లాల్ లతో పాటు కన్నడ సూపర్ స్టార్ శివన్న కూడా జైలర్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న జైలర్ మూవీకి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ ఏప్రిల్ 14నే రిలీజ్ కావాల్సిన జైలర్ సినిమా పోస్ట్ పోన్ అయ్యి ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకి రానుంది.
రిలీజ్ కి ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్స్ బయటకి రావట్లేదు. ప్రమోషన్స్ విషయంలో జైలర్ చిత్ర యూనిట్ చాలా వీక్ గా కనిపిస్తోంది. రజినీకాంత్ సినిమా ఇంత సైలెంట్ గా ఉండడం గత మూడు దశాబ్దాలుగా ఇదే మొదటిసారి. ఒక సాంగ్ అనౌన్స్మెంట్ లేదు, కొత్త పోస్టర్స్ బయటకి రావట్లేదు, సినిమా నిజంగానే ఆగస్టు 10న రిలీజ్ చేస్తున్నారా లేదా అనే అనుమానం రజినీకాంత్ అభిమానుల్లో ఉంది. ఇలాంటి సమయంలో జైలర్ సినిమాపై మళ్లీ అందరి దృష్టి పడాలి అంటే సాలిడ్ కంటెంట్ తో ప్రమోషన్స్ ని స్టార్ట్ చెయ్యాలి. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్తే జైలర్ సినిమా తప్పకుండ బాక్సాఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా చేయకుండా సైలెంట్ గా ఉంటే మాత్రం రజినీకాంత్, శివన్న, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కూడా జైలర్ సినిమా సో సో గానే రాణిస్తుంది.