Site icon NTV Telugu

Rajinikanth: ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు లెజెండ్స్…

Rajinikanth

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ మెగా ఫోన్ పట్టి డైరెక్ట్ చేస్తున్న సినిమా ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు విశాల్ హీరోగా నటిస్తున్నాడు. ఒక చిన్న సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. చిన్న సినిమాపై అంతగా అంచనాలు ఎందుకు పెరిగాయి అంటే ‘లాల్ సలామ్’లో ‘మొయిద్దీన్ భాయ్’ అనే పవర్ ఫుల్ పాత్ర ఉంది. ఈ పాత్రని సూపర్ స్టార్ రజినీకాంత్ ప్లే చేస్తున్నాడు. ఈ కారణంగానే ‘లాల్ సలామ్’ సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇటీవలే రజినీకాంత్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు. మొయిద్దీన్ భాయ్ గా రజినీకాంత్, చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. ఆల్మోస్ట్ ఒక రోజంతా సోషల్ మీడియాలో రజినీకాంత్ పోస్టర్ వైరల్ అవుతూనే ఉంది. ఈ పోస్టర్ తో లాల్ సలామ్ సినిమాపై హైప్ పెరగడానికి కారణం అయిన రజినీకాంత్, లేటెస్ట్ గా కపిల్ దేవ్ తో దిగిన ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేసాడు. ఇండియాకి వరల్డ్ కప్ తెచ్చిన మొదటి కెప్టెన్ కపిల్ దేవ్, లాల్ సలామ్ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు.

ఈ బ్యాక్ డ్రాప్ లో రజినీకాంత్, కపిల్ దేవ్ మధ్య సీన్స్ ఉన్నట్లున్నాయి. ఇద్దరు లెజెండ్స్ ఒకే ఫ్రేమ్ లో కలిసి కనిపించడం గొప్ప విషయం అనే చెప్పాలి. ప్రతి అప్డేట్ తో లాల్ సలామ్ సినిమా స్టేక్స్ ని పెంచుతుంది ఐశ్వర్య రజినీకాంత్. ఇక దళపతి విజయ్ తమ్ముడు ‘విక్రాంత్’ కూడా నటిస్తున్న లాల్ సలామ్ సినిమాలో ‘జీవిత రాజశేఖర్’ నటిస్తోంది. చాలా రోజులు తర్వాత మేకప్ వేసుకుంటున్న జీవిత రాజశేఖర్, రజినికాంత్ కి చెల్లిగా కనిపించనుంది. ఫైనల్ లెగ్ ఆఫ్ షూటింగ్ లో ఉన్న లాల్ సలామ్ సినిమాని మల్టీలాంగ్వేజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. క్రికెట్ అనే ఇండియాలో ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఎమోషన్ కాబట్టి లాల్ సలామ్ సినిమాకి పాన్ ఐడియా రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది.

Exit mobile version