Site icon NTV Telugu

Rajinikanth: గాడ్ ఫాదర్ పై తలైవా రివ్యూ.. దేన్నీ వదిలిపెట్టలేదే

Rajini

Rajini

Rajinikanth: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకొంది. ఆచార్య ప్లాప్ తో నీరసించిపోయిన మెగా అభిమానులకు ఈ సినిమా హిట్ కొద్దిగా ఊరటను కలుగజేసింది. ఇక ఇందులో మెగాస్టార్ స్వాగ్ ను చూసి మెగా అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇక సినిమా రిలీజ్ అయిన దగ్గరనుంచి అభిమానులతో పాటు సినీ ప్రముఖులు కూడా మెగాస్టార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమాను సూపర్ స్టార్ రజినీకాంత్ వీక్షించినట్లు తెలుస్తోంది. ఆయన సినిమాను వీక్షించి తనదైన శైలిలో రివ్యూ చెప్పారట.. ఈ విషయాన్ని డైరెక్టర్ మోహన్ రాజా ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ” సూపర్ స్టార్ గాడ్ ఫాదర్ సినిమాను వీక్షించారు. అద్భుతం.. చాలా బావుంది.. ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు అని చెప్పడంతో పాటు తెలుగు వెర్షన్ లో ఉన్న కొన్ని పొరపాట్లను కూడా తెలిపారు. తలైవా ధన్యవాదాలు.. నా జీవితంలో మర్చిపోలేని క్షణాల్లో ఇది ఒకటి” అని మోహన్ రాజా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక చిరుకు, రజినీ కి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ ట్వీట్ తో వారిద్దరి అనుబంధం మరోసారి బయటపడింది. ఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్ రికార్డుల సునామీ సృష్టిస్తోంది. మరి ముందు ముందు ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు అందుకుంటుందో చూడాలి.

Exit mobile version