Rajesh Danda Comments on Sundeep Kishan-Trinadha Rao Nakkina Film: సందీప్ కిషన్ హీరోగా ఊరి పేరు భైరవకోన అనే సినిమా ఫిబ్రవరి నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి మిక్స్డ్ టాక్ అందుకుంది. అయితే నిర్మాతలు మాత్రం తమకు రికవరీ జరిగిపోయిందని వెల్లడించారు. అంతేకాక తమ సినిమా సూపర్ హిట్ సినిమా అని చెప్పుకొచ్చారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అదే నిర్మాతతో సందీప్ కిషన్ ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. ధమాకా తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకుడిగా కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు సందీప్ కిషన్ సినిమా చేస్తున్నారు. ఇక ఈ సినిమా నిర్మాత రాజేష్ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి కళ్యాణ్ కృష్ణ చేయాల్సిన సినిమానే కదా ఈ మేరకు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది అని ప్రశ్నిస్తే ఆ విషయం నిజం కాదని చెప్పుకొచ్చాడు.
Pallavi Prashanth : ఆ రోజు అందుకే సీఎంని చేయమన్నా.. పొలిటికల్ ఎంట్రీపై ఓపెనయిపోయాడుగా!
నిజానికి ఇదే లైన్ ప్రసన్నకుమార్ కళ్యాణ్ కృష్ణ చిరంజీవి గార్ల సినిమాకి వినిపించాడు. కానీ మేము పూర్తిగా దానికి డిఫరెంట్ వర్షన్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చాడు. ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా తేడాలున్నాయి అని ఆయన వెల్లడించారు. ఇక ప్రస్తుతానికి తమ సినిమా ఈ ఏడాది మేలో మొదలుపెట్టి డిసెంబర్ లో రిలీజ్ చేసే ప్రణాళికలు వేస్తున్నామని వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక అల్లరి నరేష్ తో కలిసి బచ్చల మల్లి అనే సినిమా చేస్తున్నామని ఇది ఒక పీరియాడిక్ మూవీ అని ఆయన అన్నారు. 90 కాలంలో జరిగిన ఒక కథని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ఆయన వెల్లడించారు..
