NTV Telugu Site icon

Jr NTR: బాబు అరెస్టుపై ఎన్టీఆర్ అందుకే స్పందించలేదని అనుకుంటున్నా.. రాజీవ్ కనకాల ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Chandrababu Jr Ntr

Chandrababu Jr Ntr

Rajeev Kanakala Comments about NTR silence behind Chandra Babu Arrest: యంగ్ టైగర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎన్టీఆర్ సినిమాల్లో రాజీవ్ కనకాల ఎక్కువగా కనిపిస్తుంటారు. అయితే ఈ మధ్యన వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం తగ్గిందని దూరం పెరిగిందని చాలా రూమర్స్ రాగా ఆ మధ్య ఈ విషయం మీద రాజీవ్ కనకాల స్పందించారు కూడా. ఎన్టీఆర్ తో ఇప్పటికి స్నేహం అలాగే ఉంది కానీ మేమిద్దరం కలుసుకోవడం తగ్గింది అంతేనని చెప్పుకొచ్చారు.. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రని పరిచయం చేసే రోల్ లో నేనే నటించానని అందరికీ తెలుసు, కాకపోతే గతంలో మేమిద్దరం కలుసుకునేందుకు ఎక్కువ టైం ఉండేది. ఇప్పుడు ఎన్టీఆర్ బాగా బిజీగా మారారు, ఆయనకు కమిట్మెంట్స్ ఎక్కువయ్యాయి నాకు కూడా భాద్యతలు ఉన్నాయి కాబట్టి తరచుగా కలుసుకోవడం కుదరడం లేదని ఆయన అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.

Prema Vimanam Review: ప్రేమ విమానం రివ్యూ

ఇక ఇప్పుడు తాజాగా రాజీవ్ కనకాల రాజకీయాలపై ఎన్టీఆర్ సైలెన్స్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. చంద్రబాబు అరెస్ట్,ప్రస్తుత రాజకీయ పరిస్థుతుల మీద ఎన్టీఆర్ స్టాండ్ ఏంటి? అనేది అందరికీ ఒక ప్రశ్నర్ధకంగా మారిందని అంటే దానికి రాజీవ్ స్పందించారు. నేను అనుకోవడం తారక్ స్పందించక పోవడానికి గల కారణం సినిమాలు అయి ఉండవచ్చని అన్నారు. ఆర్ఆర్ఆర్ చేసే సమయంలో మూడు నాలుగు సినిమాలు చేసే వాడు, దేవర కూడా రెండు భాగాలుగా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇపుడు ఆయన కాన్సంట్రేషన్ అంతా దేవర సినిమా మీదనే ఉంది అందుకే రాజకీయాలు పై స్పందించలేదు అని నేను అనుకుంటున్నాను అని అంటూ ఆయన కామెంట్ చేశారు. ఇక ఈ విషయం మీద బాలకృష్ణ కూడా డోంట్ కేర్ అంటూ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. మరి ఎన్టీఆర్ ఎప్పటికి ఈ విషయం మీద స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది.

Show comments