RRR ఈరోజు అంత్యంత భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొనసాగుతున్న మేనియా చూస్తుంటే ఆ అంచనాలను జక్కన్న టీం అందుకున్నట్టుగానే కన్పిస్తోంది. యూఎస్ఏ లో ప్రీమియర్ షోలు, ఇండియాలో బెనిఫిట్ షోలు వీక్షించిన ప్రేక్షకుల నుంచి అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఎన్టీఆర్, చరణ్ పర్ఫార్మెన్స్, విజిల్స్ వేసే పంచ్ డైలాగ్స్, అద్భుతమైన డ్యాన్స్ సినిమాకే హైలైట్ అంటున్నారు. ఇక ఎస్ఎస్ రాజమౌళి విజన్, స్టోరీలైన్, గ్రిప్పింగ్ మాంటేజ్ షాట్స్, ఆడంబరమైన సన్నివేశాలు ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తాయని అంటున్నారు.
Read Also : RRR : స్పెషల్ షో తర్వాత జూనియర్ ఎన్టీఆర్ రియాక్షన్
అలియా భట్ నుండి ఒలివియా మోరిస్ వరకు ప్రతి ఒక్కరు తమ పాత్రలతో అద్భుతంగా నటించారని టాక్ నడుస్తోంది. సినిమాటోగ్రఫీ, సంగీతం కూడా ప్రధాన హైలెట్స్ లో భాగం. కొందరు ‘ఆర్ఆర్ఆర్’ మాస్టర్ పీస్ అని అభివర్ణిస్తే, మరికొందరు భారతీయ సినిమాకు గర్వకారణం అని అంటున్నారు. మరోవైపు ఇప్పటికే సినిమాను వీక్షించిన సెలెబ్రిటీలు సైతం సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు.
