Site icon NTV Telugu

Kuberaa Pre Release Event : నాకు, శేఖర్ కమ్ములకు తేడా అదే.. రాజమౌళి కామెంట్స్..

Rajamouli

Rajamouli

Kuberaa Pre Release Event : శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్ హీరోలుగా వస్తున్న మూవీ కుబేర. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లోనిర్వహించగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి చీఫ్‌ గెస్ట్ గా వచ్చి మాట్లాడారు. శేఖర్ కమ్ముల వాట్సాప్ వాడరు. ఆయన్ను చూడగానే మనకు చాలా హంబుల్ గా కనిపిస్తారు. కానీ ఆయన చాలా మొండి వ్యక్తి. తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి మాత్రమే సినిమాలు చేస్తారు. దానికి అడ్డు వచ్చినా ఆయన వెనకడుగు వేయరు. గత 25 ఏళ్లుగా ఆయన అదే ఫాలో అవుతున్నారు.

Read Also : Kubera Trailer : కుబేర ట్రైలర్ వచ్చేసింది..

నేను నమ్మే సిద్ధాంతాలకు చేసే సినిమాలకు సంబంధం ఉండదు. అదే నాకు, ఆయనకు ఉన్న తేడా. ఈ మూవీలో నాగార్జున, ధనుష్ నటిస్తున్నారని తెలిసినప్పుడే మూవీ వేరే లెవల్లో ఉంటుందని అనుకున్నా. ట్రాన్స్ ఆఫ్ కుబేర చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఓ వైపు రిచ్ లైఫ్‌, ఇంకో వైపు పూర్ లైఫ్ ను ఒకే ఫ్రేమ్ లో చూపించారు శేఖర్.

మూవీలో విజువల్స్ చాలా బాగున్నాయి. శేఖర్ కమ్ముల 25 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారంటే నమ్మలేకపోయాను. ఆయన నాకంటే జూనియర్ అనుకున్నా. ఆయన నాకంటే సీనియర్. ఆయన నమ్మిన సిద్ధాంతాలతోనే ముందుకు సాగాలని కోరుకుంటున్నా. మూవీ జూన్ 20న రిలీజ్ అవుతోంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి.

Exit mobile version