Site icon NTV Telugu

RRR : చెర్రీకి బెస్ట్ బర్త్ డే గిఫ్ట్… ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన త్రయం

RRR

ఎక్కడికి వెళ్లినా “ఆర్ఆర్ఆర్” గురించే చర్చ జరుగుతోంది. మ్యాగ్నమ్ ఓపస్ మొదటి రోజు రికార్డ్ కలెక్షన్లను సాధించి, బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని వసూళ్లను కొల్లగొట్టే దిశగా పరుగులు తీస్తోంది. సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను చూపించిన తీరుకు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటించారు. సెలెబ్రిటీల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధారణ ప్రేక్షకుల వరకు రాజమౌళిని ప్రశంసిస్తున్నారు. అయితే ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరాభిమానాలకు, ప్రేమకు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం థ్యాంక్స్ చెప్పారు.

Read Also : Actor Vinayakan : మీటూపై అనుచిత వ్యాఖ్యలు… సిస్టర్ అంటూ సారీ చెప్పిన స్టార్

ముందుగా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా అభిమానులు అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. ఇక తాజాగా చరణ్ తో పాటు రాజమౌళి కూడా ప్రేక్షక దేవుళ్లందరికీ థ్యాంక్స్ చెబుతూ పోస్టులు చేశారు. రాజమౌళి RRR Moviపై మీరు చూపిస్తున్న ప్రేమకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు రాజమౌళి. ఇక ‘ఆర్ఆర్ఆర్’తో ఇండియాలోనే అత్యంత ప్రతిభ కలిగిన దర్శకుడని మరోసారి నిరూపించుకున్నాడు. ఇక చెర్రీకి ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఒక బెస్ట్ గిఫ్ట్ అని చెప్పొచ్చు.

Exit mobile version