టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబోలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా టాలీవుడ్ చిత్ర పరిశ్రమను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. అయితే తాజాగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రూపొందనుంది అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా రాజమౌళి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఒక కాలేజ్ ఈవెంట్ లో ఈ రూమర్ పై క్లారిటీ ఇచ్చారు.
Read Also : మా ఇద్దరివీ విభిన్నదారులు… పవన్ తో సినిమాపై రాజమౌళి కామెంట్స్
ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం గురించి రాజమౌళి మాట్లాడుతూ ‘ప్రభాస్ ఇటీవల తన వరుస సినిమాలను ప్రకటించారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయి. ఆయనతో మళ్ళీ పని చేసే అవకాశం నాకు ఎప్పటికీ వస్తుందో?” అంటూ ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.
ఆ తర్వాత ప్రభాస్ లో ‘బుజ్జిగాడు’ తర్వాత చాలా మార్పు వచ్చిందని, నటుడిగా ఈ సినిమా తర్వాతే నటుడిగా ఆయన చాలా మారిపోయాడని, ఆ క్రెడిట్ మొత్తం పూరి జగన్నాథ్ కి వెళుతుందని అన్నారు. ప్రభాస్ మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రవితేజ, మహేష్ బాబు వంటి స్టార్స్ ను మాస్ ప్రేక్షకులకు దగ్గర చేసిన క్రెడిట్ పూరి జగన్నాథ్ కు చెందుతుందని అన్నారు.
