Site icon NTV Telugu

రాజమౌళి దర్శకత్వంలో సల్మాన్… విలన్లుగా టాలీవుడ్ టాప్ స్టార్స్ !

Salman-Khan-and-Rajamouli

మన దర్శక దిగ్గజం రాజమౌళి బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ ను డైరెక్ట్ చేస్తున్నాడు. పైగా సినిమాలో ఇద్దరు విలన్స్… వాళ్లిద్దరూ కూడా మన టాలీవుడ్ స్టార్స్ కావడం విశేషం. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు జరిగింది ? అని ఆలోచిస్తున్నారా ?… అసలు విషయం ఏమిటంటే రాజమౌళి నిజంగానే సల్మాన్ ఖాన్ ను నిజంగానే డైరెక్ట్ చేశారు. అయితే అది సినిమాలో కాదు…. బుల్లితెరపై. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ వేదికపై సందడి చేశారు టీం. ఈ షో హోస్ట్ సల్మాన్ ఖాన్‌తో చరణ్, తారక్, అలియా భట్‌లతో పాటు దర్శకుడు రాజమౌళి కన్పించారు.

https://ntvtelugu.com/mega-family-christmas-celebrations-pic-goes-viral/

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘బిగ్ బాస్ 15’ వేదికపై సల్మాన్ ఖాన్‌ను డైరెక్ట్ చేయడానికి రాజమౌళి తన ఆసక్తిని వ్యక్తం చేశాడు. స్టార్ హీరో వెంటనే అంగీకరించాడు. రాజమౌళి దర్శకుడు కాగా అలియా భట్ కెమెరామెన్, తారక్, చరణ్ విలన్‌ లుగా సల్లూ భాయ్‌ సినిమా స్టార్ట్ అయ్యింది. రాజమౌళి ‘యాక్షన్’ చెప్పగానే స్టార్ హీరోలంతా తమ నటనా ప్రతిభతో ఒకే షాట్ లో సీన్ ను కంప్లీట్ చేశారు. ఇక ఇదే షో వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ టీంతో కలిసి సల్మాన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకున్నారు. ‘బిగ్ బాస్ 15’కు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. “బిగ్ బాస్ 15″తో పాటు కపిల్ శర్మ షోతో సహా ప్రస్తుత హిందీ టీవీ పరిశ్రమలోని దాదాపు అన్ని అతిపెద్ద టీవీ షోలలో రాజమౌళి అండ్ టీం కన్పించి సినిమాకు కావాల్సిన ప్రమోషన్లు చేసుకుంటోంది. ‘ఆర్ఆర్ఆర్’ టీంకు సంబంధించిన ప్రత్యేక ఎపిసోడ్ ఈరోజు రాత్రి 9.30 నిమిషాలకు ప్రసారం కానుంది.

Exit mobile version