NTV Telugu Site icon

Rajamouli: “మేడ్ ఇన్ ఇండియా”… పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన జక్కన్న

Rajamouli

Rajamouli

ముందుగా తెలుగు సినిమా సత్తా ఏంటో పాన్ ఇండియా ఆడియన్స్ కి… అసలు ఇండియన్ సినిమా గ్లోరీ ఏంటో ప్రపంచానికి తెలిసేలా చేసాడు దర్శక ధీరుడు రాజమౌళి. అసలు హీరో ఫేస్ లేకుండా కేవలం ఇది రాజమౌళి సినిమా అనే రాజముద్ర పోస్టర్ పడితే చాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఈజీగా వెయ్యి కోట్ల కలెక్షన్స్ వస్తాయి. ఇండియన్ డైరెక్టర్స్ లో ఏ దర్శకుడికి కూడా ఈ రేంజ్ ఇమేజ్ లేదు. ఆస్కార్ అవార్డుని ఇండియాకి తీసుకోని వచ్చిన రాజమౌళి, ఇప్పుడు ‘మెడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్ తో పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి రానున్నాడు. రాజమౌళి సినిమా అనౌన్స్ చేసాడు అనగానే మహేష్ బాబుతో చేస్తున్న ‘SSMB 29’ ఏమో… ఇంత సైలెంట్ గా అనౌన్స్మెంట్ ఏంటి అనుకునేరు. ఇది రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న సినిమా కాదు రాజమౌళి ప్రెజెంట్ చేస్తున్న సినిమాకి సంబంధించిన విషయం.

యమదొంగ సినిమాని తన సొంత బ్యానర్ విశ్వామిత్ర క్రియేషన్స్ పై ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేసిన రాజమౌళి… ఆ తర్వాత మళ్లీ ప్రొడిక్షన్ వైపు వెళ్లలేదు. ఇటీవలే బాలీవుడ్ బ్రహ్మాస్త్ర సినిమాని తెలుగులో రిలీజ్ చేసిన రాజమౌళి, ఇప్పుడు మరో సినిమాని పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకి తీసుకోని వస్తున్నాడు. “అసలు ఇండియన్ సినిమా ఎక్కడ పుట్టింది? దాని ఆరిజిన్ ఏంటి?” అనే కథతో “ఇండియన్ సినిమా బయోపిక్”గా ఈ మూవీ తెరకెక్కుతుంది. నితిన్ కక్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని కార్తికేయ, వరుణ్ గుప్తా కలిస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరి ప్రమోషన్స్ చేయడంలో తనదైన ప్లానింగ్స్ వేసే రాజమౌళి… ఇండియన్ సినిమా బయోపిక్ ని వరల్డ్ ఆడియన్స్ ముందుకి ఎంతగా తీసుకోని వెళ్తాడు అనేది చూడాలి.