Site icon NTV Telugu

“రాజావిక్రమార్క”కు రాకకు ముహూర్తం ఫిక్స్

Raja Vikramarka to release on November 12th

ఒకవైపు హీరోగా, మరోవైపు విలన్ గా సత్తా చాటుతున్న యంగ్ హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం “రాజా విక్రమార్క”. ఈ మూవీ లో కార్తికేయ ఎన్‌ఐఏ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. వి. వి. వినాయక్ శిష్యుడైన శ్రీసరిపల్లి దర్శకత్వంలో రూపొందనున్న ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ను డబుల్ ఎయిట్ రామరెడ్డి నిర్మిస్తున్నారు. సీనియర్ కన్నడ స్టార్ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ ఈ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మరో యువ నటుడు సుధాకర్ కోమాకుల ఓ ప్రత్యేక పాత్రను పోషిస్తున్నాడు. ప్రశాంత్ ఆర్ విహారి దీనికి సంగీతం అందిస్తున్నారు. ఆది రెడ్డి టి సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమా గ్రాండ్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ కు సిద్ధమవుతోంది.

Read Also : బార్సిలోనా పార్క్ లో మహేష్ ఫ్యామిలీ… పిక్ వైరల్

తాజాగా మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేశారు. ఆ విషయాన్ని ప్రకటిస్తూ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. నవంబర్ 12న “రాజావిక్రమార్క” ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇందులో కార్తికేయ విక్రమ్ అనే ఏజెంట్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచేసింది.

Exit mobile version