పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హార్రర్ కామెడి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 9న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్దికుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి రెస్సాన్స్ రాగా.. రిలీజ్ ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పేచేసింది.
Also Read : Akkineni Family : 2026లో అక్కినేని ఫ్యామిలీ నుండి డిఫరెంట్ జోనర్ మూవీస్
రెండు రోజుల క్రితం తమిళ్, కన్నడతో పాటు ఇతర భాషల సెన్సార్ కూడా ఫినిష్ చేసుకుంది. ‘సెన్సార్ బోర్డ్ రాజాసాబ్ మూవీకి U/A సర్టిఫికెట్ ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ సినిమా మొత్తం నిడివి 183 నిమిషాలు.. అంటే, మూడు గంటల మూడు నిమిషాలు. ఇంత భారీ రన్ టైమ్ అంటే కాస్త ఎక్కువననే చెప్పాలి. ఈ విషయమై మారుతీ మాట్లాడుతూ ‘ కానీ ఈ సినిమా మొత్తం నిడివి నాలుగు గంటలకు వచ్చింది. స్టార్ హీరోల సినిమాల విషయంలో ఎక్కువ షాట్స్ తీస్తాం. అందువల్ల ఎక్కువ రన్ టైమ్ వస్తుంది. నాలుగు గంటల సినిమాని మూడు గంటలు వచ్చేలా కట్ చేసి ఫైనల్ వర్షన్ రెడీ చేశాం. థియేటర్లలో ప్రేక్షకులు చూడబోయే మూడు గంటల సినిమాతో పాటు, నా దగ్గర మరో గంట ఫుటేజ్ ఉంది. కానీ అన్ని సన్నివేశాలను ఫైనల్ వర్షన్ లో పెట్టలేక కొన్ని సన్నివేశాలు తప్పించాల్సి వచ్చింది. తీసేసిన సన్నివేశాలు కూడా అద్భుతంగానే ఉంటాయి” అని అన్నారు.
