ప్రభాస్ నటించిన “రాజా సాబ్” నిన్న శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ చిత్రాన్ని హారర్ ఫాంటసీ జానర్ లో రూపొందించారు దర్శకుడు మారుతి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై గ్లోబల్ సినిమా స్థాయిలో గ్రాండ్ గా మూవీని నిర్మించారు ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్. ఈ రోజు మూవీ టీమ్ కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ పేరుతో హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ – మిడ్ రేంజ్ డైరెక్టర్ అయిన నాకు ప్రభాస్ గారితో సినిమా చేశాననే క్రెడిట్ దక్కడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన ప్రభాస్ గారికి జన్మంతా రుణపడి ఉంటాను. 9 నెలలకో సినిమా చేసే నేను మూడేళ్లు కష్టపడి ఈ సినిమాను రూపొందించాను. ప్రభాస్ గారిని మీరు ఎలా చూడాలనకుంటున్నారో అలా తెరకెక్కించాను. సినిమా చూసిన వాళ్లు ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద ఒక కమర్షియల్ హీరోతో ఇలాంటి మైండ్ గేమ్ సినిమా రాలేదని అప్రిషియేట్ చేస్తున్నారు.
Also Read :Anil Ravipudi : ప్రకృతి వార్నింగ్’తో పుట్టిన హుక్ స్టెప్..అందుకే నా నిర్మాతలు ఎప్పుడూ హ్యాపీ!
ఆ 40 నిమిషాల ఎపిసోడ్ కు వరల్డ్ వైడ్ అందరు ప్రశంసిస్తున్నారు. కొత్త పాయింట్ తో వచ్చిన సినిమా ఒక్క రోజుకే అందరికీ నచ్చి పెద్ద హిట్ కాదు. కొత్త పాయింట్ ఎప్పుడైనా ప్రేక్షకులకు రీచ్ అయ్యేందుకు కొంత టైమ్ తీసుకుంటుంది. మేము చెప్పాలనుకున్న కొత్త పాయింట్ పై ఇంటలెక్చువల్స్ ఒకలా మాట్లాడుతున్నారు. అర్థం కాని వాళ్లు తిడుతున్నారు. రకరకాల రెస్పాన్స్ లు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అప్పుడే ఒక సినిమా ఫలితాన్ని డిసైడ్ చేయొద్దు. ఓల్డ్ గెటప్ లో ప్రభాస్ గారిని ట్రైలర్ లోనే పరిచయం చేశాం. ఆయన స్వాగ్, గెటప్, మేనరిజమ్ చూపించాం, థియేటర్స్ లోకి వచ్చేసరికి ఆ ప్రభాస్ గారి సీన్స్ ఏవి అని ప్రేక్షకులు వెతుక్కున్నారు. ఆ క్రమంలో మేము చూపించే కథకు వారు కనెక్ట్ కాలేకపోయారు. చాలా మంది ప్రభాస్ గారి అభిమానులు నాతో మాట్లాడారు.
Also Read : Prabhas: దెబ్బేసిన సెంటిమెంట్.. పాపం ప్రభాస్!
సినిమా బాగా చేశావన్నా అని అన్నారు. ఓల్డ్ గెటప్ సీన్స్ వస్తే బాగుంటుందన్నా అన్నారు. వారి సూచన మేరకు ప్రభాస్ గారి ఓల్డ్ గెటప్ సీన్స్ ను యాడ్ చేశాం. ఈ రోజు సాయంత్రం షోస్ నుంచి ఆ సీన్స్ రాజా సాబ్ మూవీలో చూస్తారు. రూఫ్ మీద ఫైట్ ఇప్పటిదాకా రాలేదు. 8 నిమిషాల ఆ ఫైట్ లో ప్రభాస్ గారి స్వాగ్, స్టైల్ ను ఇవాళ్టి నుంచి ఎంజాయ్ చేస్తారు. ఎక్కడైతే కొందరు లెంగ్త్, ల్యాగ్ అని ఫీలయ్యారో వాటిని షార్ప్ చేశాం. ఈ రోజు సాయంత్రం షోస్ నుంచి రియల్ రాజా సాబ్ గా నేను ఫీలయిన ప్రభాస్ గారిని స్క్రీన్స్ మీద చూపించబోతున్నాం. దీంతో ఫ్యాన్స్ సంతృప్తి చెందుతారని నమ్ముతున్నాను. సంక్రాంతికి వస్తున్న అన్ని మూవీస్ ఆదరణ పొందాలి. రాజా సాబ్ సినిమా చూసి నా డైరెక్టర్ ఫ్రెండ్స్, అల్లు అర్జున్ ఫోన్ చేసి అభినందించాడు. నేను హ్యాపీగా ఉన్నాను. నార్మల్ రేట్స్ కే రాజా సాబ్ సినిమాను మీరు థియేటర్స్ లో చూడొచ్చు. అన్నారు.
