Site icon NTV Telugu

ఓటీటీలోకి అడుగుపెట్టబోతున్న ‘రాజ రాజ చోరు’డు!

శ్రీవిష్ణు, సునయన, మేఘా ఆకాశ్ కీలక పాత్రలు పోషించిన ‘రాజ రాజ చోర’ చిత్రం ఆగస్ట్ 19వ తేదీ థియేటర్లలో విడుదలైంది. యూత్ ను ఆకట్టుకునే వినోదంతో పాటు.. కాస్తంత సందేశాన్నీ ఈ సినిమా ద్వారా దర్శకుడు హసిత్ గోలీ అందించాడు. నటీనటుల నటనతో పాటు వివేక్ సాగర్ సంగీతం కూడా ఆకట్టుకుంది. డీసెంట్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 సంస్థ సొంతం చేసుకుంది. అక్టోబర్ 8న జీ 5 ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘రాజరాజచోర’ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. దీనిని అభిషేక్ అగర్వాల్, టి.జి. విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు.

Exit mobile version