Site icon NTV Telugu

Rahul Ravindran: ‘చున్నీ’ వీడియో వివాదం పై క్లారిటీ ఇచ్చిన.. రాహుల్ రవీంద్రన్

Rahul

Rahul

రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవల మంచి విజయాన్ని సాధించింది. టాక్సిక్ రిలేషన్‌షిప్ నుండి బయటపడే అమ్మాయి కథను చెప్పిన ఈ చిత్రం, ప్రత్యేకంగా మహిళా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ చాలా మందిని భావోద్వేగానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో, క్లైమాక్స్ సీన్ చూసిన ఒక యువతి థియేటర్‌లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ను కలిసి, తన చున్నీను తీసేసి మాట్లాడిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఆ సంఘటనను కెమెరాలో రికార్డ్ చేయగా, గీతా ఆర్ట్స్ కూడా అధికారికంగా షేర్ చేయడంతో వీడియో మరింత ప్రచారం పొందింది. అయితే ఈ వీడియోపై కొంతమంది నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పించారు. “చున్నీ తీయడం ఎలా విమెన్ ఎమ్పవర్‌మెంట్ అవుతుంది?”, “అది మహిళల భద్రతకు చిహ్నం. దాన్ని తీసేయడాన్ని డైరెక్టర్ ప్రశంసించడం సరికాదే?” అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. సినిమాలో రష్మిక దుపట్టాతోనే కనిపించిందని, బయట అమ్మాయిలు సంప్రదాయాలు పాటిస్తారని, రియల్ లైఫ్‌లో ఆచారాలను మార్చమని సినిమాలో ప్రోత్సహించడం తగదని విమర్శకులు వ్యాఖ్యానించారు. ఇక తాజాగా ఈ విమర్శలకు రాహుల్ రవీంద్రన్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

Also Read : ‘The Paradise’ : నాని ‘ది ప్యారడైజ్’ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్..!

“థియేటర్‌లో జరిగిన సంఘటన పూర్తిగా యాదృచ్ఛికం. అది PR స్టంట్ కాదు. రెండు థియేటర్ల మధ్య గందరగోళంలో ఉండగా అనుకోకుండా ఆ షోకు వెళ్లాం. ఆ అమ్మాయిని కూడా అప్పుడే మొదటిసారి కలిసాం. ఆ వీడియో ని షేర్ చేయడానికి నాకు మొదట భయం అయింది. ఎందుకంటే ఆ చిన్న వర్గం ఆ యువతిని టార్గెట్ చేస్తుందని. అనుకున్నదే జరిగింది. కానీ సినిమాలో ‘చున్నీ’ నీ సీన్ కోసం మాత్రమే ఉపయోగించారు. ఎవరినీ దుపట్టా తీసేయమని సినిమా చెప్పడం లేదు. పురుషులు పండగల్లో, క్రీడా వేడుకల్లో ఆనందంతో చొక్కాలు తీసేసినా ఎవరూ ప్రశ్నించరు. కానీ మహిళలు వ్యక్తీకరణ చూపితే మాత్రం ‘సంస్కృతి’ పేరుతో విమర్శలు రావడం బాధాకరం.” అని రాహుల్ పేర్కొన్నారు. అంతేకాక “సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ఎందుకు ఎప్పుడూ మహిళలకే?” అని ప్రశ్నిస్తూ, ప్రస్తుతం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ లాంటి సినిమాలు ఎందుకు అవసరమో ఈ సంఘటనే స్పష్టంగా చెబుతోందని వ్యాఖ్యానించారు.

 

Exit mobile version