Site icon NTV Telugu

Raghu kunche : ‘ఐ యామ్ ఏ సెలబ్రిటీ’ అంటున్న రఘుకుంచె

Raghu

Raghu

గాయకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన రఘు కుంచే సంగీత దర్శకుడిగా, నటుడిగా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. సంగీత దర్శకుడిగా నటుడిగా తన అనుభవాలను ‘ఐ యామ్ ఏ సెలబ్రిటీ’ పేరుతో లిరిక్ అందించి, సంగీత దర్శకత్వం వహించి తనే పాడిన పాటను తెలుగు వీక్షకులకు అందించాడు. ఈ పాట యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది.

ఈ సందర్భంగా రఘు కుంచే మాట్లాడుతూ ‘ప్రతి మనిషికి సమాజంలో మంచి గుర్తింపు కావాలని ఉంటుంది. కానీ కొందరికే వస్తుంది. కృషి పట్టుదలతో కొందరు తాము అనుకున్నది సాధిస్తారు. అందరినీ మెప్పిస్తారు. అందుకే సమాజంలో వాళ్ళకి ప్రత్యేక గౌరవంతో పాటు సెలబ్రిటీ హోదా దక్కుతుంది. ఈ హోదాని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. విశృంఖలంగా పెరిగిన సోషల్ మీడియా వల్ల సెలబ్రిటీ స్థాయిలో ఏం చేసినా వైరల్ అవుతుంది. ఇది కత్తి మీద సామే. సెలబ్రెటీలు ఏం చేసినా సోషల్ మీడియా లో పెద్ద వార్తగా మారి మీమ్ అవుతుంది. యూట్యూబ్ లో థంబ్ నైల్ అవుతుంది. దీని ఆధారంగా వినోదభరితమైన పాట చేశాను. ఈ ‘

ఐ యామ్ ఏ సెలబ్రిటీ’ పాట మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇది కేవలం వినోదం కోసం చేసిన పాట మాత్రమే. ఎవరినీ కించపరచడానికో లేక తక్కువ చేయడానికో చేసింది కాదు. ఎవరి మనసులనైనా కష్టపెడితే క్షమించమని కోరుకుంటున్నా’ అంటున్నాడు.

 

Exit mobile version