Raghava Lawrence touches his fans feet at pre release event: హైదరాబాద్‌లో ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో లారెన్స్‌కి తన అభిమాని నుంచి ఊహించని ఘటన ఎదురైంది. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్యలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం నాడు హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేదికపై లారెన్స్ మాట్లాడుతుండగా ఆయన అభిమాని ఒకరు దూసుకుని స్టేజ్ మీదికి రాగా వచ్చి కాళ్లపై పడిన అభిమానికి జీవితాంతం గుర్తిండిపోయేలా ఒక ట్రీట్ ఇచ్చారు లారెన్స్. తన మీదికి దూసుకుని వస్తుంటే.. ‘ఏంటమ్మా’ అని అడిగి కాళ్లపై పడుతుంటే.. వద్దు వద్దని.. తిరిగి తన అభిమాని కాళ్లకి నమస్కారం చేశారు లారెన్స్.
Mahesh Babu with Venkatesh: పెద్దోడు-చిన్నోడు భలే కలిసిపోయి ‘ముక్క’ వేశారే!
ఆ తరువాత అతన్ని దగ్గరకు తీసుకుని ప్రేమగా మాట్లాడి అతను చెప్పేదంతా ప్రశాంతంగా విన్నారు. బౌన్సర్లు అతనిపైకి దూసుకొస్తుండగా.. ఆగండి అని ఆపేసి ప్రేమగా లారెన్స్ తన అభిమానిని గుండెలకు హత్తుకుని అతను చెప్పేదంతా విన్నారు. ఆ తరువాత ఆ అబ్బాయి చెప్పిన దాన్ని అందరికీ చెప్పుకొచ్చాడు లారెన్స్, నేను మా అమ్మకి గుడికట్టాను కదా ఆ ప్రేరణతో ఈ అబ్బాయి తన గుండెలపై తల్లి పచ్చబొట్టుని పొడిపించున్నాడట అంటూ అతని గుండెలపై ఉన్న అమ్మ పచ్చబొట్టుని అందరికీ చూపించారు లారెన్స్. చాలా సంతోషం అని అంటూ తన అభిమానిని దగ్గరకు తీసుకుని బుగ్గపై ముద్దు కూడా పెట్టారు లారెన్స్. అలా తన అభిమానికి ఊహించని స్వీట్ షాక్ ఇచ్చి మరచిపోలేని ఒక మెమరీ ఇచ్చి పంపించారు లారెన్స్.