Raghava Lawrence To Play Antagonist In Khaithi 2: సెన్సేషనల్ విజయం సాధించిన ‘ఖైదీ’ సినిమాకు సీక్వెల్ రూపొందనున్న విషయం తెలిసిందే! ఈ సినిమాతోనే దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన ‘లోకీ వర్స్’ మొదలుపెట్టాడు. ఈ చిత్రాన్ని.. లోకనాయకుడు కమల్ హాసన్‌తో చేసిన ‘విక్రమ్’ సినిమాతో లింక్ పెట్టాడు. ఇప్పుడు విక్రమ్ సినిమా ఎక్కడైతే ముగిసిందో, అక్కడి నుంచి ఖైదీ 2 సినిమా ప్రారంభం కాబోతోంది. సీక్వెల్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి కాబట్టి, వాటిని అందుకు రీతిలో లోకేష్ హంగులు అద్దుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అతడు ఓ కీలక పాత్ర కోసం దెయ్యాల రారాజు(దెయ్యాల సినిమాల్లో ఆత్మలకు తన బాడీని అద్దెకు ఇస్తుంటాడు కాబట్టి ఆ పేరు వచ్చింది)గా పేరుగాంచిన రాఘవ లారెన్స్‌ని రంగంలోకి దింపనున్నట్టు సమాచారం.
విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి పాత్ర ముగిసింది కాబట్టి.. అతని స్థానంలో డ్రగ్ కింగ్‌పిన్ రోలెక్స్ (సూర్య) రాఘవ లారెన్స్‌ని అపాయింట్ చేస్తాడని ప్రచారం జరుగుతోంది. అతని పాత్ర ద్వారే ఖైదీ 2, విక్రమ్ సినిమాలను లోకేష్ కనెక్ట్ చేయనున్నాడని తెలుస్తోంది. విక్రమ్‌లో విజయ్ పోషించిన పాత్ర తరహాలోనే లారెన్స్ పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉండనుందని, అందుకే అతడు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడని వార్తలొస్తు్న్నాయి. అంటే.. ఖైదీ 2లో విజయ్, లారెన్స్ మధ్య గట్టిగానే పోరు జరగనుందన్నమాట! ఇదే నిజమైతే.. ఖైదీ 2 చిత్రానికి మరింత ప్రత్యేక ఆకర్షణ వచ్చినట్టే! నెగెటివ్ రోల్స్ చేయడంలో లారెన్స్ దిట్ట కాబట్టి, ఇందులో చెలరేగిపోవడం ఖాయమని చెప్పుకోవడంలో సందేహం లేదు. అయితే.. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరో ట్విస్ట్ ఏమిటంటే.. దళపతి విజయ్‌తో లోకేష్ చేస్తున్న ‘విజయ్67’ సినిమా కూడా అతని లోకీ వర్స్‌లో భాగమే. ఈ విషయాన్ని విక్రమ్‌లో ఓ కీ రోల్ పోషించిన నటుడు వెల్లడించాడు. అంటే.. విక్రమ్‌లో కమల్ హాసన్ తరహాలో అతడు కాప్ రోల్‌లో కనిపించవచ్చు. ఈ సినిమాను ముగించిన తర్వాత ‘ఖైదీ 2’ సెట్స్ మీదకి వెళ్లనుంది.
