Site icon NTV Telugu

Raghava Lawrence: నా ట్రస్ట్ కి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు.. రాఘవ లారెన్స్ షాకింగ్ వీడియో

Raghava Lawerence

Raghava Lawerence

Raghava Lawrence Releases a Video about funds to his Trust: సైడ్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తర్వాత కొరియోగ్రాఫర్ స్థాయికి వెళ్లి నటుడిగా మారి దర్శకుడు, నిర్మాతగా వరుస విజయాలను సొంతం చేసుకుని తనదైన గుర్తింపు సాధించారు. తాను సంపాదించిన డబ్బును కేవలం తనకు, తన వాళ్లకు మాత్రమే ఖర్చు చేయాలనుకోకుండా సమాజంలో పేద వారి కోసం, ఆపన్నుల కోసం కూడా అని భావించి ఓ ట్రస్ట్ ను స్థాపించి తద్వారా ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు లారెన్స్. 60 మంది పిల్లలను పెంచడమే వికలాంగులకు డాన్స్ నేర్పించడం, కరోనా సమయంలో నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం, గుండె ఆపరేషన్స్ చేయించడం వంటివి చేస్తూ క్రమంగా ఆయన తన సేవా కార్యక్రమాలు పెంచుకుంటూ వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన తన ఛారిటీకి ఎవరూ డబ్బులు ఇవ్వకండి అని రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

ఈ మేరకు ఓ వీడియో విడుదల చేసి అందులో ఆయన మాట్లాడుతూ ..”నా ట్రస్ట్ కి ఎవరూ డబ్బులు పంపొద్దు, నా పిల్లల్ని నేను చూసుకుంటాను, అని కొన్ని రోజుల ముందు రిక్వెస్ట్ చేస్తూ నేను ఒక ట్వీట్ చేశా, అందుకు కారణమేంటంటే నేను డాన్స్ మాస్టర్ గా ఉన్నప్పుడు ఓ ట్రస్ట్ ని స్టార్ట్ చేశాను అని అన్నారు. అందులో 60 మంది పిల్లల్ని పెంచడం, వికలాంగులకు డాన్స్ నేర్పించడం, ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించడం వంటి కార్యక్రమాలు నిర్వహించా, ఈ పనులన్నింటినీ నేను ఒకడ్నినే చేయలేకపోయాను అందుకనే ఇతరుల నుంచి సాయం కావాలని కోరానని అన్నారు. అప్పుడు రెండేళ్లకు ఒక సినిమానే చేసేవాడిని, కానీ ఇప్పుడు సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను, బాగానే డబ్బులు వస్తున్నాయి కదా, నాకు నేనే చేయొచ్చు కదా, ఇతరులను ఎందుకు అడిగి చేయాలని నాకే అనిపించిందని అన్నారు.

తాను పొగరుతో ఇతరులు సేవ కోసం ఇచ్చే డబ్బులు వద్దనడం లేదు, నాకు ఇచ్చే డబ్బులు మీకు దగ్గరలో డబ్బుల్లేక కష్టపడే ట్రస్టులు చాలానే ఉన్నాయి, అలాంటి వారికి సాయం చేయండని అలా చేస్తే వారికెంతో ఉపయోగపడుతుందని అన్నారు. వారికి చాలా మంది సాయం చేయరు, నేను ఎంత చెప్పినా కొందరైతే నాతో కలిసే సాయం చేస్తామని అంటున్నారు, చాలా సంతోషం. ఆర్థిక ఇబ్బందులో బాధపడేవారెవరో నేనే చెబుతాను, మీచేత్తో మీరే సాయం చేయండి, అది మీకు ఎంతో సాయాన్ని కలిగిస్తుంది అని ఆయన అన్నారు. ఇక ‘చంద్ర ముఖి 2’ ఆడియో లాంచ్ ఈవెంట్ లో లారెన్స్ నిర్వహిస్తున్న ట్రస్ట్ కోసం కోటి రూపాయల విరాళాన్ని లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ ప్రకటించగా ఈ డబ్బుతో పాటు తను కూడా కొంత డబ్బు వేసుకుని ఓ స్థలం కొని అందులో సుభాస్కరన్ తల్లి పేరు మీద బిల్డింగ్ కడతానని పేర్కొన్న లారెన్స్ తన స్టూడెంట్స్ ఆ బిల్డింగ్ లో డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటారని లారెన్స్ చెప్పుకొచ్చారు.

Exit mobile version