NTV Telugu Site icon

Chandramukhi 2 Trailer: ఇది చంద్రముఖిలా లేదు… ఎదో సినిమా చూసినట్లు ఉంది

Chandramukhi

Chandramukhi

బ్యాడ్ స్ట్రీక్ లో ఉన్న రజినీకాంత్ ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది ‘చంద్రముఖి’. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి 100 కోట్ల సినిమాగా చరిత్రకెక్కిన చంద్రముఖి హారర్ జానర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ లా ఉండేది. ఈ మూవీలో రజినీకాంత్, జ్యోతిక చేసిన పెర్ఫార్మెన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ. ముఖ్యంగా జ్యోతిక పెద్ద పెద్ద కళ్లతో దెయ్యంలా నటిస్తుంటే వెన్నులో వణుకుపుట్టింది. విద్యాసాగర్ ఇచ్చిన మ్యూజిక్ రజినీకాంత్ ఇంట్రడక్షన్ ని ఎలివేట్ చేయగా… క్లైమాక్స్ లో రజినీకాంత్ ‘వేంకటపతి రాజా’గా విశ్వరూపం చూపించాడు. లకలకలక అంటూ రజినీకాంత్ రాజు గెటప్ లో వచ్చిన తర్వాత నుంచి చంద్రముఖి దెయ్యం డాన్స్ పెరఫార్మెన్స్ అయ్యే వరకూ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మూవీ. ఇలాంటి మూవీకి పీ వాసు గతంలో ‘నాగవల్లి’ అనే సీక్వెల్ చేసాడు కానీ అది అంతగా వర్కౌట్ అవ్వలేదు.

ఈసారి చంద్రముఖి 2 అంటూ కొత్త సినిమాని సెప్టెంబర్ 15న ఆడియన్స్ ముందుకి తీసుకొని రాబోతున్నారు. పీ వాసు డైరెక్షన్, కీరవాణి మ్యూజిక్ ఇస్తున్న చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ ‘రాజు’ పాత్రలో నటిస్తుండగా, చంద్రముఖిగా టైటిల్ రోల్ ని కంగనా రనౌత్ ప్లే చేస్తోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ చంద్రముఖి 2 ట్రైలర్ ని రిలీజ్ చేసారు. ఈ ట్రైలర్ లో వడివేలు, రాధికా, రావు రమేష్, లక్ష్మీ మీనన్, మహిమ నంబియర్ లు కనిపించారు. చంద్రముఖి చూసిన ఏ ఒక్కరికీ చంద్రముఖి 2 ట్రైలర్ కనెక్ట్ కూడా అయ్యే అవకాశం కనిపించట్లేదు. ఏదో కొత్త హారర్ సినిమా చూసినట్లు, రాఘవ లారెన్స్ కాంచన సీరీస్ లో ఎదో సినిమా చేస్తున్నట్లు ఉంది కానీ చంద్రముఖిలా అనిపించకపోవడం బాధాకరం. మరి ఓవరాల్ గా సినిమా థియేటర్స్ లో ఎలా అలరిస్తుందో చూడాలి.