NTV Telugu Site icon

Raghava Lawrence: చంద్రముఖి 2 విషయంలో లారెన్స్ హ్యాపీనేనట

Raghava Lawrence about Chandramukhi 2 Result: కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకి సీక్వెల్ గా చంద్రముఖి 2 సినిమా ఈ మధ్యనే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ సినిమాలో చంద్రముఖిగా నేషనల్ అవార్డు విన్నర్ కంగనా రనౌత్ నటించినది. పీ వాసు దర్శకత్వంలో తెరకెక్కి సినిమా భారీ అంచనాల నడుమ విడుదలైనా సరే అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. తమిళనాడు సహా తెలుగులో కూడా ఈ సినిమా ఏ మాత్రం ఇంపాక్ట్ చూపలేకపోయింది, ఫలితంగా వసూళ్లు దారుణంగా నమోదయ్యాయి. ఈమధ్య డిజిటల్ లో రిలీజ్ అయిన తర్వాత అక్కడ చూసినవారు సైతం ఈ సినిమా ఏంటి ఇలా ఉంది అంటూ పెదవి విరిచినట్టుగానే కామెంట్లు సోషల్ మీడియాలో కనిపించాయి.

Raviteja: ది ఈగల్ ఈజ్ కమింగ్…

అయితే ఈ సినిమా రిజల్టు విషయంలో తన హ్యాపీగానే ఉన్నానని రాఘవ లారెన్స్ చెప్పుకొచ్చాడు. జిగుర్ తండా డబుల్ ఎక్స్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ మేరకు ఆయన కామెంట్ చేశాడు. చంద్రముఖి 2 రిజల్ట్ విషయంలో మీరు హ్యాపీగానే ఉన్నారా? అని అడిగితే చాలా హ్యాపీగా ఉన్నానని తాను చేత డాన్సులు చేయించారు, ఫైట్లు చేయించారని ఎక్కడో బాలీవుడ్ నుంచి హీరోయిన్ ని తీసుకొచ్చి తన పక్కన నటింప చేశారని ఇంతకన్నా ఏం కావాలి అని ఆయన చెప్పుకొచ్చాడు. సినిమా చేయడం వరకు తమ బాధ్యతనే కానీ తర్వాత ప్రేక్షకులకు నచ్చుతుందా లేదా అనేది ఎవరు అంచనా వేయలేమని అన్నాడు. ఏ ప్రాజెక్టు అయినా ప్రేక్షకులకు నచ్చి తీరుతుందని నమ్మకంతోనే చేస్తామని ఒక్కోసారి మాత్రం ఫలితం అనుకున్నట్లు రాకపోవచ్చని చెప్పుకొచ్చాడు. గ్రూప్ డాన్సర్ స్థాయి నుంచి ఒక హీరోగా దర్శకుడిగా ఎన్నో చూసి వచ్చానని ఒక్కోసారి అంచనాలు తప్పడంలో ఏమాత్రం ఇబ్బంది లేదు అన్నట్టుగా ఆయన కామెంట్ చేశాడు.

Show comments