NTV Telugu Site icon

Parineeti Chopra: ఆప్ నేతతో పరిణీతి సీక్రెట్ గా అది కానిచ్చేసిందా.. ఆ ట్వీట్ కు అర్ధం ఏంటి..?

Parinithi

Parinithi

Parineeti Chopra: బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా డేటింగ్ గురించే సినీ, రాజకీయ రంగాలల్లో పెద్ద చర్చ జరుగుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. ఆమె డేటింగ్ చేస్తుంది మామూలు వ్యాపారవేత్తతో కాదు ఆప్ నేత రాఘవ్ చద్దాతో.. ఆమ్ ఆద్మీ పార్టీ నేత రాఘవ్ తో పరిణీతీ ప్రేమాయణం నడుపుతోందని ఎన్నో రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ మధ్యనే ఈ జంట ఒక రెస్టారెంట్ లో కనిపిస్తూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో ఈ జంట మధ్య ప్రేమాయణం నిజమే అని సోషల్ మీడియా కన్ఫర్మ్ చేసింది. అయితే ఈ విషయమై రాఘవ్ ను అడిగితె వ్యంగ్యంగా సమాధానం ఇవ్వడం మరింత హీట్ ఎక్కించింది. రాజనీతి గురించి అడగండి.. పరిణీతీ గురించి కాదు అంటూ నవ్వేసి వెళ్ళిపోయాడు. ఇక ఈ సీన్ తరువాత బాలీవుడ్ లో వీరి పెళ్లి గురించే వార్తలు నడుస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారట.. ఇక ఇంకొంతమంది అయితే వీరిద్దరికి సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని చెప్పుకొస్తున్నారు.

Sana: ఆ హీరోతో పడక సీన్లు.. అందుకే చేశా.. ఇకముందు కూడా చేస్తా

ఇక ఇలా అనుకోవడానికి కారణం కూడా లేకపోలేదు. తాజాగా ఆప్ నేత సంజీవ్ అరోరా.. కొత్త జంటకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేయడం నెట్టింట కలకలం రేపింది. ” రాఘవ్- పరిణీతి.. మీ జంటకు నా హృదయపూర్వక శుబాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారిద్దరూ ఒక్కటిగా కలిసి ఉండాలని, వారి మధ్య ప్రేమ, ఆనందం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. మీ జంటకు నా శుభాకాంక్షలు” అంటూ చెప్పుకొచ్చారు. అయితే ఈ ట్వీట్ కు అర్ధం.. వారు నిశ్చితార్థంతో ఒక్కటి అయ్యారనే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. వారు కూడా ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ ట్వీట్ పై ఈ ప్రేమజంట ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show comments