ఇండస్ట్రీ ఏదైనా క్యాస్టింగ్ కౌచ్ అనే సమస్య మాత్రం ఉంటుంది. ఇక్కప్పుడు ఇలాంటి విషయాలు బయటకు చేప్పుకునే వారు కాదు.. కానీ ఈమధ్య కాలంలో నటిమణులు ఈ విషయంపై ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. దీంతో ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చార్చలకు దారి తీస్తున్నాయి. ఒక్కోసారి అసలు ఎప్పుడూ ఇలాంటి ఆరోపణల ఎదురుకోని స్టార్ హీరోలను సైతం వేలెత్తి చూపించేలా చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ హీరోయిన్ రాధిక ఆప్టే చేసిన కామెంట్స్ ఇప్పుడు సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
Also Read : Rukmini Vasant : ‘సప్తసాగరాలను దాటి’ విజయానంతరం.. రుక్మిణి ఎదుర్కొన్నకెరీర్ స్ట్రాగుల్స్
బాలీవుడ్, టాలీవుడ్‌లో గుర్తింపు పొందిన హీరోయిన్ రాధికా ఆప్టే ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన అసభ్య అనుభవాన్ని పంచుకున్నారు. రాధిక మాట్లాడుతూ.. ‘ఒక ప్రముఖ తెలుగు స్టార్ హీరో ఎలివేటర్‌లో వెళ్తున్నప్పుడు అసభ్యకరమైన మాటలు మాట్లాడాడు. నిజానికి ఆ హీరోకు నాకు అంతగా పరిచయం లేదు. కానీ నాతో అతిగా మాట్లాడారు. ఎప్పుడైనా అర్ధరాత్రి వేళ .. మీకు దురద పెడితే.. నన్ను పిలవండి.. అని చాలా చెండాలంగా ప్రవర్తించాడు.. సీరియస్ గా చూశాను.. నా చూపుకే ఆ ముసలి హీరో సైలెంట్‌గా వెళ్ళిపోయాడు’ అంటూ రాధికా షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారో ఇప్పటికీ స్పష్టంగా తెలియకపోవడం గమనార్హం.
