Site icon NTV Telugu

Radhika Apte: ఆ విషయంలో నా భర్త ఒక చెత్త.. అస్సలు కోపరేట్ చేయడు

Radhika

Radhika

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధికా ఆప్టే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె బోల్డ్ వ్యాఖ్యలు.. అంతకుమిచ్చిన బోల్డ్ పాత్రలు ఆమెను అందరికి సుపరిచితురాలిని చేశాయి. ఇక తెలుగులో కూడా అమ్మడి గురించి తెలియనివారు ఉండరు. లెజెండ్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి మెప్పించిన ఈ బ్యూటీ కి పదేళ్ల క్రితమే వివాహం అయిన విషయం తెల్సిందే. అయినా భర్త బెనెడిక్ట్ గురించి చెప్పమంటే మాత్రం అమ్మడు అస్సలు నోరు విప్పదు. ఇక్కడమ్మాయి.. అక్కడబ్బాయి లా బెన్ ఏమో విదేశాల్లో.. రాధికా ఏమో ముంబైలో .. ఎప్పుడో వీలు కుదిరినప్పుడు తప్ప కలవరు. అది తనకు కూడా చాలా కంఫర్ట్ అంటూ చెప్పుకొస్తుంది రాధికా. ఇక పదేళ్ల తరువాత రాధికా, భర్తతో దర్శనమిచ్చింది. ఒక వెకేషన్ లో అమ్మడు బెన్ తో పాటు పోజు ఇచ్చింది. ఇక ఇటీవల రాధికా ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగతమైన విషయాలను పంచుకుంది.

మీరు ఎందుకు ఎప్పుడూ మీ భర్తతో ఫోటోలు దిగరు అన్న ప్రశ్నకు రాధికా మాట్లాడుతూ ” నేను ఇక్కడ .. బెన్ అక్కడ.. ఎప్పుడో ఒకసారి కలుసుకుంటాం.నా పని నేను చేసుకోవడానికే ఇష్టపడతాను.. నా పర్సనల్ ను బయట పెట్టుకోవడం నాకు ఇష్టముండదు. ఇక ఫోటోల విషయానికొస్తే.. నాకు ఫోటోల మీద అంత పెద్ద అభిరుచి లేదు. ఇక నాకన్న బెన్ పరమ చెత్త టేస్ట్. ఫోటోలు అంటే అస్సలు కోపరేట్ చేయడు. అందుకే ఇప్పటివరకు మా పెళ్లి ఫోటోలు కూడా లేవు. నిజం చెప్పాలంటే మా పెళ్లి పది నిమిషాల్లో అయిపొయింది. ఫోటోలు లేవు. ఫోటోలు తీసే ఫొటోగ్రాఫర్లు ఉన్నా మాకు దిగేంత ఇంట్రెస్ట్ కూడా లేదు” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత కెరీర్ పరంగా త్వరగానే విడిపోయినా కలిసినప్పుడు ఎంతో ప్రేమగా ఉంటాం అంటూ చెప్పుకొచ్చింది.

Exit mobile version